మనం తయారు చేసుకున్న మాస్కులే మంచివంట

మనం తయారు చేసుకున్న మాస్కులే మంచివంట
అవతలి వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే నీటి తుంపరలు మనల్ని చేరకుండా అడ్డుకోవడంలో ఇవి కీలక పాత్రను

కరోనా రాకుండా మిగతా జాగ్రత్తలు ఎలాగూ పాటించలేకపోతున్నాం.. కనీసం మాస్క్ అయినా పెట్టుకుందామని దాదాపుగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తున్నారు. మరి అవి నిజంగానే వైరస్ ని అడ్డుకుంటాయో లేదో అనే అనుమానం ఉన్నా అసలు లేని దాని కంటే కొంత మేలే కదా అని మాస్కులు ధరిస్తున్నారు. కరోనా సీజన్‌లో మాస్కులకు మార్కెట్ బాగానే ఉంది. ఫ్యాషన్ వస్త్రాల మాదిరిగా రోజుకో కొత్త రకం మాస్కులు మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి. ఇంతకీ ఏ మాస్కులు సురక్షితం. వైరస్‌ని అడ్డుకోవడంలో అవి ఎతవరకు పని చేస్తాయి అన్న సందేహమూ కలుగుతోంది.

ఈ మాస్కులకు సంబంధించి యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మార్కెట్లో లభించే వివిధ రకాల మాస్కుల కంటే ఇంట్లో మనం తయారు చేసుకున్న మాస్కులే ఉత్తమమైనవని అంటున్నారు. అవతలి వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే నీటి తుంపరలు మనల్ని చేరకుండా అడ్డుకోవడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు. సాధారణ వస్త్రంతో తయారు చేసిన మాస్కులు మెడికల్ మాస్కులకు ఏమాత్రం తీసిపోవని పైగా గాలి ఆడట్లేదన్న ఇబ్బంది కూడా ఉండదని పేర్కొన్నారు.

ఈ మేరకు జర్నల్ ఆఫ్ ఎక్సిమ్ మెకానిక్స్ లెటర్స్ అధ్యయనంలో తమ పరిశోధనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పరిశోధనలో భాగంగా వైరస్ కణాలు ఉన్న డిస్టిల్డ్ వాటర్‌ను ఇన్‌హెల్లర్‌లో నింపి, ఓ ప్లాస్టిక్ పాత్రలో దానిని అధిక ద్రవ్యరాశి గల తుంపరల రూపంలో వాటిని వదిలిపెట్టారు. వివిధ రకాల మెటీరియల్స్ ఉపయోగించి వడకట్టారు. వేటికైతే కణాలను ఆపగల శక్తి ఎక్కువగా ఉందో పరిశీలించారు. ఇంట్లో ఉపయోగించే వస్త్రాలు వైరస్‌ను సమర్ధవంతంగా ఎదుర్కున్నట్లు గుర్తించారు. ఈ ప్రయోగంలో మొత్తం 11 రకాల వస్త్రాలను పరిశీలించి సింగిల్ లేయర్ కర్ఛీఫ్‌లు కూడా వైరస్‌ను సమర్ధవంతంగానే ఎదుర్కుంటాయని చెప్పుకొచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story