వంట గ్యాస్ మండుతోంది.. 15 రోజుల వ్యవధిలో మళ్లీ బాదుడు

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో పాటు, వంట గ్యాస్ ధరలు పెరగడం సామాన్యుల మీద అదనపు భారం. 15 రోజుల వ్యవధిలో గ్యాస్ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. డిసెంబర్ 2వ తేదీన ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచిన చమురు సంస్థలు.. మంగళవారం మరో రూ.50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది.
వినియోగదారులకు రాయితీ రూపంలో అందించే ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నేడు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపుతో దేశ రాజధానిలో ప్రస్తుతం రూ.644 ఉన్న 14.2 కిలోల సబ్సిడీ సిలిండర్ ధర రూ.694కు పెరిగింది. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే మేర గ్యాస్ ధర మోత మోగనుంది. ఇక 5 కేజీల సిలిండర్‌పై రూ.18.. 19 కేజీల సిలిండర్‌పై రూ.36.50 పెంచితున్నట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తున్నట్లు చమురు సంస్థలు తెలిపాయి.
ఎల్పీజీ సిలిండర్ ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయి. గృహావసరాల కోసం కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్‌పై రాయితీ కల్పిస్తోన్న విషయం తెలిసిందే. వినియోగదారులు సంవత్సరానికి 12 సిలిండర్ల వరకు రాయితీతో కొనుగోలు చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ కావాలంటే మార్కెట్ ధరలకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ సబ్సీడీ మొత్తాన్ని కేంద్రం వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com