Sudha Murthy: అమ్మా.. మీరు ఇలా చేయడం సరికాదు..: నెటిజన్స్ కామెంట్స్

Sudha Murthy: అమ్మా.. మీరు ఇలా చేయడం సరికాదు..: నెటిజన్స్ కామెంట్స్
Sudha Murthy: ఇన్ఫోసిస్ చైర్‌పర్సన్ సుధా మూర్తి.. భర్త నారాయణమూర్తి గారి కంటే చాలా ఫేమస్.. అమె ప్రసంగాలు, ఆమె పుస్తకాలు, ఆమె ఆహార్యం ఆమెకు ఎంతో మంది అభిమానులను చేరువ చేసింది.

Sudha Murthy: ఇన్ఫోసిస్ చైర్‌పర్సన్ సుధా మూర్తి.. భర్త నారాయణమూర్తి గారి కంటే చాలా ఫేమస్.. అమె ప్రసంగాలు, ఆమె పుస్తకాలు, ఆమె ఆహార్యం ఆమెకు ఎంతో మంది అభిమానులను చేరువ చేసింది. నిరాడంబరతకు మారు పేరు సుధా మూర్తి. అయితే ఆమె చేసిన ఓ పనిని నెటిజన్లు తప్పు పడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు.

సమర్థించేవారు కొందరైతే విమర్శించే వారు మరికొందరు. ఇంతకీ ఆమె ఏం చేసారంటే.. రాచరికం ముగిసిన దశాబ్దాల తరువాత కూడా రాజ కుటుంబ సభ్యులకు సుధామూర్తి వంగి నమస్కరించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ ఇలాంటి పద్ధతి కొనసాగుతోందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

రాచరికం ముగిసిన దశాబ్దాల తర్వాత రాచరిక సంస్కృతిని గౌరవించడంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఓ ట్విట్టర్ యూజర్ మైసూరు రాజకుటుంబం ముందు రచయిత్రి సుధా మూర్తి నమస్కరిస్తున్న చిత్రాన్ని పోస్ట్ చేశారు.

"మైసూర్ రాజకుటుంబ సభ్యుల ముందు సుధా మూర్తి నమస్కరిస్తున్నారు.. చూడండి. ఆమె ఒక రోల్ మోడల్‌గా ఉండాలి, "అని ట్విట్టర్ వినియోగదారు రాశారు. అయినప్పటికీ, చాలా మంది మూర్తి చర్యను సమర్థించారు, వరుణ్ అనే యూజర్ ఇలా అన్నారు, "అది మన సంస్కృతి. వయసు, ఎత్తు, స్థాన భేదం లేకుండా అందరూ రాజమాతకు నమస్కరిస్తారు. ఆమె సంస్కృతి ఆమెకు ఇది నేర్పింది. "

అయితే, మరొకరు "బానిసత్వం లోతుగా పాతుకుపోయింది" అని పోస్ట్ చేసారు. "అది ఆమె వ్యక్తిగత ఎంపిక, ఎవరికైనా సాష్టాంగ నమస్కారం చేయమని ఆమె మిమ్మల్ని అడిగిందా?" మరొకరు కామెంట్ చేశారు.

"పాత మైసూర్ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ రాజకుటుంబం పట్ల అపారమైన గౌరవాన్ని కలిగి ఉంటారు. రాణికి నమస్కరించడమనేది సాధారణ పద్దతి'' అని సుబ్బు అయ్యర్ అనే నెటిజన్ సుధామూర్తి చర్యను సమర్ధించారు. ఇలా భిన్నాభిప్రాయాలతో స్పందిస్తున్న నెటిజన్లకు సుధామూర్తి ఏమైనా సమాధానం చెబుతారేమో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story