వేధించే వెన్నునొప్పి.. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మొదటి సంకేతం కావచ్చు: నిపుణుల హెచ్చరిక

వేధించే వెన్నునొప్పి.. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మొదటి సంకేతం కావచ్చు: నిపుణుల హెచ్చరిక
ఇలా ఎక్కువ సేపు తప్పు భంగిమలో కూర్చోవడం వల్ల వెన్నునొప్పి, కంటి సమస్యలు వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

కోవిడ్ మహమ్మారి ప్రతి ఒక్కరి జీవితాన్ని దెబ్బతీసింది. కార్యాలయ సంస్కృతి నుండి ఇంటి నుండి పని చేసే వారి సంఖ్య ఎక్కువైంది. ఆఫీసులో పని చేస్తున్నప్పుడు కేటాయించిన ఛైర్‌లో కూర్చుని పని చేస్తాము. అదే ఇంట్లో ఉంటే ఎక్కడ పడితే అక్కడ అంటే బెడ్ మీద సపోర్ట్ లేకుండా కూడా ఒక్కోసారి పని చేయాల్సి వస్తుంది. ఇలా ఎక్కువ సేపు తప్పు భంగిమలో కూర్చోవడం వల్ల వెన్నునొప్పి, కంటి సమస్యలు వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

వెన్నునొప్పితో బాధపడటం ఇది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు మొదటి సంకేతం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, ఎక్కువ గంటలు కూర్చోవడం, జీవనశైలికి మధ్య బలమైన సంబంధం ఉందని జామా ఇంటర్నల్ మెడిసిన్ పేర్కొంది.

ఇంటి నుండి పనిచేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. మధ్యలో లేచి ఇంటి చుట్టూ కొంచెం నడవాలి. ల్యాప్‌టాప్ లేదాకంప్యూటర్ స్క్రీన్ యొక్క ఎత్తును కంటికి ఎదురుగా లేదా కొంచెం దిగువకు సర్దుబాటు చేయడం, వెనుక సపోర్ట్ కోసం గట్టి దిండు పెట్టుకోవడం వంటివి చేయాలన్నారు.

అయితే, కొన్ని సందర్భాల్లో, వెన్నునొప్పి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను తీసుకువస్తుంది. ప్యాంక్రియాటిక్ కణజాలంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అభివృద్ధి చెందుతుంది. మీ పొట్ట యొక్క దిగువ భాగం వెనుక ఉన్న ఉదరంలోని ఒక అవయవం పాంక్రియాటిక్.

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నివేదిక ప్రకారం, భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రతి 100,000 మంది పురుషులలో 0.5-2.4, ప్రతి 100,000 మంది మహిళలలో 0.2-1.8 మంది బాధపడుతున్నట్లు నిర్ధారించారు. ఇది దేశంలో విస్తృతంగా ప్రబలంగా ఉన్న 11 వ క్యాన్సర్. ప్రారంభ దశలో దీనిని గుర్తించకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని డాక్టర్ చెప్పారు.

క్లోమంలో క్యాన్సర్ అభివృద్ధి చెందడం మొదలవుతుంది. మద్యపానం, ధూమపానం, ఆహారపు అలవాట్లు కూడా క్యాన్సర్ పెరుగుదలను ప్రేరేపిస్తాయి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అభివృద్ధిలో కుటుంబ చరిత్ర కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మెజారిటీ కేసులలో లక్షణాలు.. కడుపు నొప్పి, బరువు తగ్గడం, డయాబెటిస్ వంటి తేలికపాటివి కావచ్చు, ప్రారంభ దశలో రోగ నిర్ధారణ చేయడం కష్టమవుతుంది.

ప్రారంభ దశలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను నిర్ధారించడానికి సరైన పరీక్ష అందుబాటులో లేదని భావిస్తారు. కానీ ప్యాంక్రియాటిక్ రోగ నిర్ధారణ USG, CT స్కాన్, MRI మొదలైన వాటి ద్వారా చేయవచ్చు. బయాప్సీ ద్వారా క్యాన్సర్‌ను నిర్ధారించవచ్చు. అయితే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను సాంప్రదాయ పద్ధతుల ద్వారా, బయాప్సీ ద్వారా నిర్ధారించడం కష్టం. ఎందుకంటే క్లోమం మన ఉదరం లోపల వివిధ ముఖ్యమైన అవయవాల వెనుక భాగంలో ఉంటుంది. ఇక్కడే ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ (ఇయుఎస్) వంటి అత్యాధునిక వైద్య పరీక్షల ద్వారా తేలికగా చేయవచ్చు. తద్వారా వ్యాధి ప్రారంభ దశలోనే నిర్ధారణ అవుతుంది అని డాక్టర్ సౌరభ్ చెప్పారు.

Tags

Next Story