ప్రేమ పెళ్లి.. పదిరోజులకే పెళ్లి కూతురు ఆత్మహత్య

ప్రేమ పెళ్లి.. పదిరోజులకే పెళ్లి కూతురు ఆత్మహత్య
X
పోలీసులు వారి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడినా శ్రీలేఖను తీసుకు వెళ్లడానికి మనోహర్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు..

తెలిసీ తెలియని వయసులో ప్రేమలు, పెళ్లిళ్లు.. పెద్దవాళ్లు ఒప్పుకోవట్లేదని ఆత్మహత్య చేసుకుని జీవితాలకు ముగింపు పలకడం.. తాజాగా జనగామ పట్టణంలోని సఖి కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కొడకండ్ల మండలం ఏడు నూతల గ్రామానికి చెందిన మద్దెబోయిన శ్రీలేఖ (20), దేశబోయిన మనోహర్ (20) ప్రేమించుకున్నారు.

కులాలు వేరు కావడంతో పెద్దవాళ్లు తమ ప్రేమను అంగీకరించరని భావించి ఈ నెల 17న ఇంటి నుంచి వెళ్లి పోయి వివాహం చేసుకున్నారు. 22న ఇద్దరూ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తాము పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. పోలీసులు వారి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడినా శ్రీలేఖను తీసుకు వెళ్లడానికి మనోహర్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.. కొడుకుని మాత్రం తీసుకుని వెళ్లిపోయారు.

ఇటు శ్రీలేఖ తల్లిదండ్రులు కూడా ఆమెను ఇంటికి రమ్మనలేదు. దీంతో పోలీసులు ఆమెను సఖి కేంద్రంలో ఉంచారు. అక్కడే ఆదివారం మధ్యాహ్న బాత్‌రూమ్‌ శ్రీలేఖ చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువతి రాసిన చీటీని స్వాధీనం చేసుకున్నారు. నా చావుకి మనోహర్ తల్లిదండ్రులు కారణం అని రాసి ఉంది. శ్రీలేఖ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story