Sukanya Samriddhi Yojna: ఆడపిల్ల భవిష్యత్తుకు భరోసా.. సుకన్య సమృద్ధి యోజన

Sukanya Samriddhi Yojna: సుకన్య సమృద్ధి యోజన ( SSY ) అనేది ఆడపిల్లల కోసం ప్రారంభించబడిన ప్రభుత్వ డిపాజిట్ పథకం. ప్రభుత్వం చేపట్టిన 'బేటీ బచావో, బేటీ పడావో' ప్రచారంలో భాగంగా దీనిని ప్రారంభించారు. ఉన్నత విద్య లేదా వివాహం కోసం ఆడపిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి ఈ పథకం ప్రారంభించబడింది.
సుకన్య సమృద్ధి యోజనలో ఎవరు పెట్టుబడి పెట్టొచ్చు..
10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలిక సంరక్షకులు ఈ ఖాతా తెరవవచ్చు. పథకం నిబంధనల ప్రకారం, ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు బాలికలకు ఖాతాలు తెరవవచ్చు.
డిపాజిట్ యొక్క కనిష్ట, గరిష్ట మొత్తం ఎంత?
ఖాతాను కనీసం రూ. 250తో తెరవవచ్చు. ఖాతా తెరిచిన తర్వాత, ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 250 డిపాజిట్ చేయాలి. ఖాతాదారుడు ప్రతి సంవత్సరం ఖాతాలో కనీస మొత్తాన్ని డిపాజిట్ చేయడంలో విఫలమైతే, ఆ ఖాతా డిఫాల్ట్ ఖాతాగా పరిగణించబడుతుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో జమ చేయగల గరిష్ట మొత్తం రూ. 1.5 లక్షలు.
సుకన్య సమృద్ధి ఖాతాను తెరవడానికి అవసరమైన పత్రాలు
ఖాతాను తెరవడానికి, సంరక్షకుడు తప్పనిసరిగా పూరించిన ఫారమ్-1తో పాటు ఆడపిల్ల డేటాఫ్ బర్త్ సర్టిఫికేట్‌ను సమర్పించాలి. సంరక్షకుని PAN, ఆధార్ నెంబర్ కూడా జతచేయాలి.
సుకన్య సమృద్ధి ఖాతాలో ఎంతకాలం డిపాజిట్లు చేయవచ్చు?
ఖాతా తెరిచిన తేదీ నుండి 15 సంవత్సరాలు పూర్తయ్యే వరకు డిపాజిట్లు చేయవచ్చు.
సుకన్య సమృద్ధి ఖాతా ఎప్పుడు మెచ్యూర్ అవుతుంది?
సుకన్య సమృద్ధి ఖాతా ఖాతా తెరిచిన తేదీ నుండి 21 సంవత్సరాల తర్వాత లేదా 18 సంవత్సరాలు నిండిన తర్వాత మెచ్యూర్ అవుతుంది.
సుకన్య సమృద్ధి ఖాతాపై వడ్డీ రేటు ఎంత ?
సుకన్య సమృద్ధి ఖాతాపై వడ్డీ రేటు సంవత్సరానికి 7.6%గా నిర్ణయించబడింది.
సుకన్య సమృద్ధి ఖాతాలో వడ్డీ మొత్తం ఎలా లెక్కించబడుతుంది?
ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో అసలు వడ్డీ మొత్తం ఖాతాలో జమ చేయబడుతుంది.
సుకన్య సమృద్ధి ఖాతాను ఎక్కడ తెరవవచ్చు?
సుకన్య సమృద్ధి ఖాతాను పోస్టాఫీసులో లేదా ఈ పథకాన్ని అందించే బ్యాంకులో తెరవవచ్చు.
సుకన్య సమృద్ధి యోజనపై ఎలాంటి పన్ను ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి?
సుకన్య సమృద్ధి యోజన ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం మినహాయింపు స్థితిని పొందుతుంది. పథకం కింద చేసిన డిపాజిట్లు సెక్షన్ 80C కింద మినహాయింపును అందిస్తాయి. డిపాజిట్లపై వచ్చే వడ్డీ మరియు మెచ్యూరిటీ మొత్తానికి పన్ను మినహాయింపు ఉంది.
సుకన్య సమృద్ధి ఖాతాను ముందస్తుగా మూసివేయవచ్చా..
కొన్ని షరతులలో సుకన్య సమృద్ధి ఖాతాని ముందస్తుగా మూసివేయడానికి అనుమతించబడుతుంది. ఖాతా తెరిచిన 5 సంవత్సరాల తర్వాత అకౌంటు మూసివేయవచ్చు. ఖాతాదారుని (అంటే ఆడపిల్ల) మరణించిన తర్వాత లేదా ఖాతా సంరక్షకుని మరణంతో అకౌంట్ మూసివేయడానికి అనుమతి లభిస్తుంది. ఖాతాదారు మరణించిన సందర్భంలో, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా వడ్డీ రేటు మరణించిన తేదీ నుండి చెల్లింపు తేదీ వరకు వర్తిస్తుంది.
సుకన్య సమృద్ధి ఖాతా నుండి డబ్బు విత్‌డ్రా చేసుకునే ప్రక్రియ ఏమిటి?
స్కీమ్ నియమాల ప్రకారం, ఖాతాదారుని, అంటే ఆడపిల్ల చదువు నిమిత్తం ఉన్న బ్యాలెన్స్‌లో గరిష్టంగా 50% వరకు ఉపసంహరించుకోవచ్చు. ఆడపిల్లకు 18 ఏళ్లు నిండిన తర్వాత లేదా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఉపసంహరణ అనుమతించబడుతుంది.
సుకన్య సమృద్ధి ఖాతాను డిఫాల్ట్‌గా ఎలా పునరుద్ధరించాలి?
ఆర్థిక సంవత్సరంలో కనీస డిపాజిట్ చేయకపోతే సుకన్య సమృద్ధి ఖాతా డిఫాల్ట్ ఖాతాగా మారుతుంది. డిఫాల్ట్‌లో ఉన్న ఖాతాను కనీస డిపాజిట్ మొత్తాన్ని చెల్లించడం ద్వారా ఖాతా తెరిచిన తేదీ నుండి 15 సంవత్సరాలు పూర్తయ్యేలోపు పునరుద్ధరించవచ్చు, అంటే డిఫాల్ట్ అయిన ప్రతి సంవత్సరానికి రూ. 250 మరియు జరిమానా మొత్తం రూ. 50 చెల్లిస్తే ఖాతా పునరుద్ధరించబడుతుంది.
అమ్మాయి భవిష్యత్తుకు భరోసా.. సుకన్య సమృద్ధి యోజన
Sukanya Samriddhi Yojanaసుకన్య సమృద్ధి ఖాతాను ఎవరు నిర్వహిస్తారు?
ఆడపిల్లకు 18 ఏళ్లు వచ్చే వరకు ఖాతా సంరక్షకునిచే నిర్వహించబడుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com