Sukesh Chandrashekar: జైల్లో వైభోగం.. గుచీ చెప్పులు, ఖరీదైన జీన్స్..

Sukesh Chandrashekar: జైల్లో వైభోగం.. గుచీ చెప్పులు, ఖరీదైన జీన్స్..
జైల్లో సుఖేశ్ విలాసవంతమైన జీవితం; ఆకస్మిక తనిఖీలో బయటపడ్డ వస్తువులు; కన్నీరుమున్నీరు అయిన ఘరానా మోసగాడు

ఘరానా మోసగాడు సుఖేశ్ చంద్రశేఖర్ జైల్లో విలపిస్తూ కెమెరా కంటికి చిక్కాడు. మండోలి జైల్ లో సుఖేశ్ సెల్ లో జైలు అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా రూ. 80వేల ఖరీదైన బ్రాండెడ్ జీన్స్ తో పాటూ, ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ కు చెందిన గుచి చెప్పులు బయటపడ్డాయి. వీటితో పాటూ రూ. లక్ష యాభై వేలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నంత సేపూ మౌనంగానే వారికి సహకరించిన సుఖేశ్, వారు వెళుతూనే విలపించడం మొదలుపెట్టాడు. అనంతరం తిరిగి సాధారణ స్థితికి చేరుకుని చల్లాచెదురుగా పడిన వస్తువులను సర్దుకోవడం ప్రారంభించాడు. ఈ దృశ్యాలు జైలు సెల్లోని సీసీటీవీల్లో రికార్డ్ అవ్వగా... ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తొలుత తీహార్ జైలుకు సుఖేశ్ ను తరలించగా, తన ప్రాణాలకు హాని ఉందని అతడు సుప్రీం కోర్టుకు విన్నవించుకోవడంతో మండోలి జైల్ కు తరలించారు. తీహార్ జైల్ అధికారులు తన నుంచి అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని సుఖేశ్ ఆరోపించాడు. వారికి డబ్బులు ఇస్తే ముబైల్ ఫోన్ ను అనుమతిస్తామని వారు చెప్పినట్లు తెలిపాడు.

Tags

Next Story