Sukhjinder Randhawa : పంజాబ్ కొత్త సీఎంగా సుఖ్‌జిందర్ రణ్‌దావా..!

పంజాబ్ ఉత్కంఠకు తెరపడింది. కొత్త సీఎంగా సుఖ్‌జిందర్ సింగ్ రణ్‌దావా బాధ్యతలు చేపట్టనున్నారు. అతని పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. నిన్న అమరీందర్ సింగ్ రాజీనామాతో ఖాళీ అయిన పంజాబ్ సీఎం కుర్చీని సుఖ్ సిందర్ సింగ్ తో భర్తీ చేశారు. సీఎం రేసులో పలువురి పేర్లు వినిపించినా, చివరకు మెజారిటీ శాసనసభ్యుల మద్దతు ఉన్న సుఖ్ జిందర్ సింగ్ రణ్‌దావా వైపు ఏఐసీసీ మొగ్గుచూపింది. కాంగ్రెస్ శాసనసభాపక్ష భేటీలో సుఖ్‌జిందర్ సింగ్ రణ్ దావాను నాయకుడిగా ఎన్నుకోవడం ఇక లాంఛనప్రాయమే. అమరీందర్ సింగ్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసిన సుఖ్ జిందర్ సింగ్... పిసిసి అధ్యక్షుడు నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూతో కలిసి అసమ్మతి గళం వినిపించారు. అమరిందర్ కు వ్యతిరేకంగా పావులు కదిపారు. ముఖ్యమంత్రిగా తనను అదిష్టానం ప్రకటించడం ఆనందంగా ఉందని, అందర్నీ కలుపుకుని కాంగ్రెస్ ను పటిష్టం చేస్తానని సుఖ్‌జిందర్ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com