కళాకారుని ప్రతిభ.. గేదెపై పెయింట్

కళాకారుని ప్రతిభ.. గేదెపై పెయింట్
ఓ మంచి చిత్రం కళాకారుని ప్రతిభకు అద్దం పడుతుంది. కళాకారుడిలోని సృజనాత్మకత అతడి అద్భుత ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుంది.

ఓ మంచి చిత్రం కళాకారుని ప్రతిభకు అద్దం పడుతుంది. కళాకారుడిలోని సృజనాత్మకత అతడి అద్భుత ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుంది. రాజా రవివర్మ, లియోనార్డో డావిన్సీ, ఎంఎఫ్ హుస్సేన్, సుదర్శన్ పట్నాయక్ వంటి గొప్ప చిత్రకారులను పెయింటిగ్స్ అంటే మక్కువ వున్నవారు స్మరించుకుంటూనే ఉంటారు. ఇంకా మరెందరో కళాకారులు సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి వస్తున్నారు. వారి ఆలోచనలు, వారి కళానైపుణ్యం ఔరా అనిపించేలా ఉంటోంది. నాలుగు వర్ణాలు కలిస్తే ఓ మంచి చిత్రంగా కళాకారుని కుంచెలోనుంచి జాలువారుతుంది.

తాజాగా ఓ కళాకారుడు తన ప్రతిభతో గేదె మీద పురుషుడి బొమ్మ, స్త్రీ బొమ్మ వేశాడు. గేదె నడిచి వెళుతున్నప్పుడు మనిషి నడిచి వెళుతున్నట్లుగా అనిపిస్తుంది. మరో ఆవు మీద కూడా ఇలానే చిత్రాలు గీశాడు. దూరం నుంచి ఈ చిత్రాలను గమనిస్తే ఎవరో ఇద్దరు మనుషులు నడిచి వెళుతున్నారని భ్రమ కలుగక మానదు. ఎవరో అజ్ఞాత కళాకారుడు వేసిన ఈ చిత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో వీడియో వైరల్ అయింది.

Tags

Next Story