Supreme Court: లైంగికతతో సంబంధం లేదు...

Supreme Court: లైంగికతతో సంబంధం లేదు...
హైకోర్టు న్యాయమూర్తిగా సౌరభ్ కిర్పాల్ నియామకానికి మద్దతు తెలిపిన సుప్రీం కోర్టు...

వ్యక్తి లైంగిక ధోరణి అతడి ఎదుగుదలకు అడ్డుకారాదని పేర్కొంటూ సంచలన సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు న్యాయమూర్తిగా సౌరభ్ కిర్పాల్ ను నియమించడం సమంజసమేనని తెలిపింది. సౌరభ్ కిర్పాల్ కు చిత్తశుద్ధి, తెలివితేటలు ఉన్నాయని ఆయన ఢిల్లీ హైకోర్టు బెంచ్ విలువను పెంచుతారని కొలిజియం అభిప్రాయపడింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా సీనియర్ న్యాయవాది సౌరభ్ కిర్పాల్ నియమాకానికి నవంబర్ 11, 2021న చేసిన సిఫార్సును సమర్ధించింది. హైకోర్టు న్యాయమూర్తిగా సీనియర్ న్యాయవాది సౌరభ్ కిర్పాల్ నియమాకానికి సంబంధించిన ప్రతిపాదన ఐదేళ్లుగా పెండింగ్ లో ఉందని, వీలైనంత తొందరగా ప్రాసెస్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కొలిజియం లేఖ రాసింది.. సౌరభ్ కిర్పాల్ లైంగిక ధోరణి గురించి రహస్యంగా ఉంచలేదని కొలీజియం చెప్పింది. రాజ్యాంగబద్దంగా గుర్తించబడిన హక్కుల దృష్ట్యా కిర్పాల్ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడం సుప్రీం కోర్టు నిర్దేశించిన రాజ్యాంగ సూత్రాలకు విరుద్దంగా ఉందని పేర్కొంది.

భారత రిసెర్జ్ అనాలసిస్ వింగ్ (RAW) ప్రకారం సౌరభ్ కిర్పాల్ స్వలింగ సంపర్కుడు కాగా, అతడి భాగస్వామి స్విస్ దేశస్థుడు కావడం విశేషం. ఈ రెండు విషయాలపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. కిర్పాల్ ను హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలన్న సుప్రీం కోర్టు ప్రతిపాదనను హోల్డ్ లో పెట్టింది.

కొలిజియం స్పందిస్తూ భారత దేశానికి స్విస్ మిత్రదేశమేనని పేర్కొంది. ఈ కారణంచేత భారత్ పట్ల కిర్పాల్ విద్వేషపూరితంగా వ్యవహరిస్తాడనడానికి, ఏకారణమూ లేదని చెప్పింది. మన దేశంలో అత్యన్నత పదవులలోని జీవిత భాగస్వాములు విదేశీయులు కావడం సర్వసాధారణమని అభిప్రాయపడింది. సౌరభ్ కిర్పాల్ పదొన్నతిపై కొలిజియం తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. ఇకనైనా కిర్పాల్ ను హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని... కేంద్ర ప్రభుత్వానికి రెండో సారి లేఖ రాసింది. ఈ లేఖను కొలిజియం, సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో పొందుపరిచింది.

రెండో సారి సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడానికి లేదు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా సౌరభ్ కిర్పాల్ నియామకం జరుగనున్నట్లు న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story