ప్రశాంత్ భూషణ్‌కు శిక్ష ఖరారు చేసిన సుప్రీం కోర్టు

ప్రశాంత్ భూషణ్‌కు శిక్ష ఖరారు చేసిన సుప్రీం కోర్టు
ప్రశాంత్ భూషణ్ కు సుప్రీంకోర్టు శిక్షను ఖరారు చేసింది. వివాదాస్పద ట్వీట్ల కేసులో ఆయనకు ఉన్నత న్యాయస్థానం

ప్రశాంత్ భూషణ్ కు సుప్రీంకోర్టు శిక్షను ఖరారు చేసింది. వివాదాస్పద ట్వీట్ల కేసులో ఆయనకు ఉన్నత న్యాయస్థానం ఒక రూపాయి జరీమానా విధించంచింది. చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డేతో పాటు సుప్రీం న్యాయ‌మూర్తుల‌ను విమ‌ర్శించిన ఈ మేరకు ఆయనకు శిక్ష పడింది. సెప్టెంబ‌ర్ 15వ తేదీలోగా ఆయ‌న త‌న జ‌రిమానా క‌ట్టాలని.. లేని పక్షంలో ఆయనకు మూడు నెల‌ల జైలు శిక్ష లేదా మూడు ఏళ్ల పాటు న్యాయ‌వాద వృత్తిలో కొన‌సాగ‌రాదు అని సుప్రీంకోర్టు త‌న తీర్పులో వెల్ల‌డించింది. కాగా.. చీఫ్ జస్టిస్ సహా.. న్యాయమూర్తులపై ప్రశాంత్ భూషణ్ చేసిన వివాదాస్ప‌ద ట్వీట్లకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలని సుప్రీం కోర్టు ఇటీవల కోరింది. అయితే, ఆయన మాత్రం దీనికి ససేమిరా అన్నారు. క్షమాపణలు చెప్పాలని రెండు సార్లు అవకాశం ఇచ్చినా.. ఆయన మాత్రం పంతం వీడలేదు. ఏ శిక్షకైనా సిద్ధంగా ఉంటా.. కానీ, క్షమాపణలు మాత్రం చెప్పనని తెగేసి చెప్పారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు ఒక రూపాయి జ‌రిమానా విధిస్తూ సుప్రీం కోర్డు తీర్పునిచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story