రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక సూచనలు

రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక సూచనలు
కరోనా బాధితుల కోసం అందుబాటులో ఉన్న అంబులెన్స్ సేవలకు ఛార్జీలను సహేతుకంగా ఉంచాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలకు సూచించింది.

కరోనా బాధితుల కోసం అందుబాటులో ఉన్న అంబులెన్స్ సేవలకు ఛార్జీలను సహేతుకంగా ఉంచాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలకు సూచించింది. కరోనా రోగులకు సహేతుకమైన అంబులెన్స్ ఖర్చును రాష్ట్రాలు నిర్ణయించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అంబులెన్సుల సామర్థ్యాన్ని ప్రభుత్వాలు పెంచాలని.. దీనికి తగిన చర్యలను త్వరలోనే తీసుకోవాలని సుప్రీం కోర్టు పేర్కొంది. రోగులను చేర్చడానికి అంబులెన్స్ సేవలను పెంచాలని కోరింది. అంబులెన్స్ ఛార్జీల పెంపు పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Tags

Next Story