పెగాసస్ విచారణ.. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు

పెగాసస్‌పై విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడే సమాంతర చర్చలు జరగడం దురదృష్టకరం అన్నారు. పిటిషనర్లు చెప్పాలనుకున్న విషయాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలన్నారు. సోషల్ మీడియా, బయట జరిగే చర్చలకు పరిధి ఉండాలన్నారు చీఫ్ జస్టిస్. దీంతో పిటిషన్లు పరిధి దాటి వెళ్లకుండా చూస్తామని పిటిషర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
పిటిషనర్లు ఇష్టానుసారం చర్చలు జరపకుండా, సోషల్ మీడియాలో చర్చలకు తావివ్వకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఇక పెగాసస్‌పై విచారణ సందర్భంగా అన్ని పిటిషన్లకు సంబంధించిన కాపీలు తమకు అందాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం నుంచి సమాచారం రావాల్సి ఉందని, అందుకు కొంత సమయం కావాలని కోరడంతో... విచారణను సోమవారానికి వాయిదా వేసింది ధర్మాసనం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com