బీహార్ ఎన్నికలు వాయిదా కుదరదు: సుప్రీంకోర్టు

బీహార్ ఎన్నికలు వాయిదా కుదరదు: సుప్రీంకోర్టు
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అక్టోబర్, నవంబర్ లో జరగనున్న ఎన్నికలు వాయిదా వేయాలని ఎలక్షన్ కమిషన్ ను ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. కరోనాకు తోడు రాష్ట్రంలో వరదలు ఆందోళనకరంగా మారాయని పిటిషన్ లో తెలిపారు. దీంతో ఈ మేరకు ఎన్నికల కమిషన్ ను ఆదేశించాలని కోరారు. అయితే, దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఎదైనా నిర్ణయం తీసుకునే ముందు ఎలక్షన్ కమిషన్ ప్రతీది పరిశీలిస్తుందని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story