మరాఠాలకు ప్రత్యేక రిజర్వేషన్ సాథ్యం కాదు: సుప్రీం కోర్టు

మహారాష్ట్రలో మరాఠా సామాజికవర్గానికి రిజర్వేషన్ విషయంలో సుప్రీం కోర్టులో విచారణలకు వచ్చింది. ప్రత్యేక కోటా కింద ఈ సామాజికి వర్గానికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పించటం సాధ్యం కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దేశంలో రిజర్వేషన్లు 50 శాతం మించరాదని 1992లో ఇందిర సాహ్ని కేసులో గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు గుర్తు చేసింది. 50శాతం రిజ్వేషన్లు దాటితే అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4)కు విరుద్ధమని తెలిపింది. జనజీవన స్రవంతిలో ఇప్పటివరకూ కలువని జాతులు, అత్యంత వెనుకబడిన వర్గాల వారికోసం మాత్రమే ప్రత్యేక కోటా కింద 50 శాతం పరిమితిని దాటేందుకు రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉన్నదని తెలిపింది. మహారాష్ట్రలో మరాఠాలు 30 శాతం ఉన్నారన్న కారణం తప్ప... రిజర్వేషన్ల కల్పించడానికి ప్రభుత్వం బలమైన కారణం లేదని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com