Gali Janardhan Reddy: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు..

Gali Janardhan Reddy: గనుల అక్రమ తవ్వకాల కేసుకు సంబంధించిన కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బెయిల్ నిబంధనలు సడలించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
ఎఫ్‌ఐఆర్ నమోదై 11 ఏళ్లు గడిచినా.. విచారణ ప్రారంభం కాకపోవడం దురదృష్టకరమంటూ జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సాధ్యమైనంత త్వరగా కేసు విచారణను ముగింపునకు తీసుకురావాలని తీవ్ర నేరాలకు సంబంధించిన కేసులో నిందితులు విచారణను జాప్యం చేయడానికి ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముందని పేర్కొంది. ఎంత జాప్యమైతే అంత మేర సాక్షులను ప్రభావితం చేసే అవకాశముంది.. కాబట్టి రోజువారీ విచారణకు ఆదేశిస్తున్నాం'అంటూ అని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు రోజువారీ విచారణ నిర్వహించాలని సీబీఐ ప్రత్యేక కోర్టుకుఆదేశాలు ఇచ్చింది సుప్రీం కోర్ట్. ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గాలి జనార్ధన్ రెడ్డిని బళ్లారి, అనంతపురం, కడప జిల్లాలకు వెళ్లకుండా విధించిన బెయిల్ షరతును రద్దు చేయాలని కోరుతూ గాలి జనార్దన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. ఆయన కుమార్తెకు డెలివరీ కావడంతో వచ్చే నెల 6 వరకు మాత్రమే బళ్లారిలో ఉండడానికి అనుమతించింది కోర్టు.
ఇక విచారణ త్వరగా పూర్తి కావడానికి నిందితులు కోర్టుకు సహకరించాలని ఆదేశించింది. విచారణను జాప్యం చేయడానికి ప్రయత్నిస్తే తీవ్రంగా పరిగణిస్తామంటూ హెచ్చరించింది. ''ఐపీసీ సెక్షన్లు 120బీ,420, 379, 409, 468, 411, 427, 447తో పాటు ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్‌లోని సెక్షన్ 2, మైన్స్ యాక్ట్‌లోని 4ఏ, 23 యాక్ట్ విత్ రెడ్ విత్ వంటి కేసుల్లో గాలి జనార్దన్ రెడ్డిపై సీబీఐ కేసు దర్యాప్తు చేస్తోంది. కేసులో సాక్షులుగా అనంతపురం,కడప, బళ్లారి ప్రాంతాలకు చెందిన వ్యక్తులే ఎక్కువగా ఉండటంతో గాలి జనార్ధన్ రెడ్డి మూడు జిల్లాలకు వెళితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో కోర్టు అయనకు నిబంధనలు విధించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com