సుప్రీంకోర్టులో యోగీ ప్రభుత్వానికి ఉరట..!
లాక్‌డౌన్ పెట్టాలా వద్దా అనేది కోర్టులు నిర్దేశించలేవని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలహాబాద్ హైకోర్టు ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది.
BY vamshikrishna20 April 2021 9:00 AM GMT

X
vamshikrishna20 April 2021 9:00 AM GMT
లాక్‌డౌన్ పెట్టాలా వద్దా అనేది కోర్టులు నిర్దేశించలేవని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలహాబాద్ హైకోర్టు ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కరోనాను కట్టడి చేసే చర్యలు చేపట్టడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన అలహాబాద్ హైకోర్టు.. యూపీలోని ఐదు నగరాల్లో లాక్‌డౌన్ విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లాక్‌డౌన్ విధించే అంశం న్యాయవ్యవస్థ పరిధిలో లేదని తెలిపింది. తెలంగాణ హైకోర్టు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. తెలంగాణ ప్రభుత్వం గనక స్పందించకపోతే తామే ఆదేశాలు ఇస్తామని చెప్పింది. సుప్రీం తాజా ఆదేశాల ప్రకారం.. కరోనా కట్టడికి తీసుకునే చర్యలపై రాష్ట్ర ప్రభుత్వాలకే పూర్తి అధికారం ఉంటుందని తేలిపోయింది.
Next Story