Surat: ఎంత ఘాటు ప్రేమో.. భర్తకు బంగారు పూల బహుమతి

Surat: ఎంత ఘాటు ప్రేమో.. భర్తకు బంగారు పూల బహుమతి
Surat: నిజానికి ప్రేమను తెలపడానికి ఓ ప్రత్యేకమైన రోజు అంటూ ఏమీ ఉండదు.. కానీ ప్రత్యేకంగా యువతను ఆకర్షించే ఆ రోజు వాలెంటైన్స్ డే..

Surat: నిజానికి ప్రేమను తెలపడానికి ఓ ప్రత్యేకమైన రోజు అంటూ ఏమీ ఉండదు.. కానీ ప్రత్యేకంగా యువతను ఆకర్షించే ఆ రోజు వాలెంటైన్స్ డే.. తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు ప్రేమికులు. ప్రేమలో మరింత ఎక్కువగా మునిగి తేలుతుంటారు. ఓ రోజ్ ఇచ్చి తమ ప్రేమను తెలిపే వారు కొందరైతే, తమ ప్రియమైన వారకి డైమండ్ రింగులు ఇచ్చే వారు కూడా ఉన్నారు. అదంతా పాత స్టైల్.. ఇప్పుడు కొత్త ట్రెండ్‌కి తెర తీసారు సూరత్ ప్రేమికులు..

సూరత్‌లోని ఆభరణాల వ్యాపారులకు ప్రతి సందర్భాన్ని మార్కెట్ ఎలా చేసుకోవాలో బాగా తెలుసు.. అందుకే ప్రేమికుల రోజు బంగారు పూతతో కూడిన ప్రత్యేక పుష్పగుచ్ఛాన్ని రూపొందించారు. దీని విలువ లక్షల రూపాయలు. షాపుకు వచ్చిన కస్టమర్లు ఈ పుష్పగుచ్ఛాన్ని ఎంతో ఇష్టపడుతున్నారు.

తమ ప్రియమైన వారికి ఇవ్వడానికి ఆకర్షణీయమైన మరియు ఖరీదైన బొకేలను ప్రీ-ఆర్డర్ చేస్తారు, అయితే ఈసారి ప్రేమికుల రోజున, జంటలు ఒకరికొకరు నిజమైనవి కాకుండా బంగారు పూత పూసిన గులాబీ బొకేలను ఇస్తున్నారు. పెళ్లయ్యాక మొదటి ప్రేమికుల రోజున, సూరత్‌కు చెందిన పరిధి అనే అమ్మాయి తన భర్త దీప్ కోసం 108 బంగారు పూతపూసిన గులాబీలతో హృదయాకారంలో చేసిన బంగారు పూల పుష్ప గుచ్చాన్ని ఇచ్చి తన ప్రేమను తెలిపింది.

ప్రేమికుల రోజున భర్త లేదా ప్రేమికుడు బహుమతులు ఇస్తారని, అయితే తాను మాత్రం భర్తకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పరిధి తెలిపింది. తన భర్త కోసం బంగారు పూత పూసిన గులాబీల గుత్తిని ఇచ్చిన పరిధిబెన్, తాను ఒక నగల దుకాణంలో వజ్రాల ఉంగరాన్ని కొనుగోలు చేయడానికి వచ్చానని చెప్పింది. అప్పుడు బంగారు గులాబీల పుష్ప గుచ్చాన్ని చూశానని చెప్పింది. అది చాలా నచ్చింది. అందులో 108 బంగారు పూత పూసిన గులాబీలు ఉన్నాయి. మేము నిజమైన గులాబీలను ఇవ్వగలము, కానీ అవి వాడిపోతాయి. అందుకే ఈ గోల్డెన్ రోజ్ తయారు చేశాము. ఇవి ఎప్పుడూ వాడి పోకుండా వారి దగ్గరే ఉంటాయి. తమ ప్రేమ కూడా అలాగే ఉంటుంది అని షాపు యజమానులు తెలియజేస్తున్నారు.

భర్త దీప్ మాట్లాడుతూ, నా భార్యే నాకు నిజమైన గులాబీ పువ్వు. ఈ బంగారు గులాబీలా, మా సంబంధం కూడా శాశ్వతంగా ఉంటుంది. గోల్డ్ ప్లేట్ గులాబీ ఒక్కో పువ్వు ధర రూ.1,700 కాగా ఈ బొకే తయారు చేయడానికి లక్ష రూపాయలు ఖర్చైందని తెలిపారు నగల వర్తకులు.

Tags

Next Story