జాతీయం

ఢిల్లీలోని ఓ గల్లీకి సుశాంత్ రాజ్‌పుత్ పేరు

సుశాంత్ సింగ్ మరణం పరిశ్రమకు విషాదాన్ని మిగిల్చింది

ఢిల్లీలోని ఓ గల్లీకి సుశాంత్ రాజ్‌పుత్ పేరు
X

దివంగత బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎంఎస్ ధోని బయోపిక్‌లో తన నటనతో భారతదేశం మొత్తాన్ని ఆకర్షించాడు. ఆయన మృతి చెందాడన్న విషయాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. గురువారం సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. అతడు నటించిన సినిమాల క్లిప్‌లను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఢిల్లీలోని ఓ వీధికి స్థానిక మునిసిపల్ అధికారి.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మార్గ్ అని పేరు పెట్టారు.

గత ఏడాది సెప్టెంబర్‌లో స్థానిక కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ సుశాంత్ సింగ్ పేరుతో దక్షిణ ఢిల్లీలోని ఆండ్రూస్ గంజ్ రోడ్‌కు పేరు పెట్టాలని ప్రతిపాదించారు. అధికారులు ఇటీవల ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పారు. దాంతో రహదారికి అధికారికంగా పేరు మార్చారు. సుశాంత్ సింగ్ మరణం పరిశ్రమకు విషాదాన్ని మిగిల్చింది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక మంచి స్టార్ హీరోని కోల్పోయిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

Next Story

RELATED STORIES