మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ సామాజికవేత్త స్వామి అగ్నివేశ్‌ కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ సామాజికవేత్త స్వామి అగ్నివేశ్‌ కన్నుమూత

ప్రముఖ సామాజికవేత్త స్వామి అగ్నివేశ్‌ కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మానవ హక్కుల ఉద్యమాల్లో అగ్నివేశ్ క్రియాశీలకంగా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లాలో 1939 సెప్టెంబర్‌ 21న అగ్నివేశ్‌ జన్మించారు. నాలుగో ఏట తండ్రి మరణించడంతో ఛత్తీస్‌గఢ్‌లోని తాత ఇంట్లో పెరిగారు. కోల్‌కతాలో లెక్చరర్‌గా పని చేశారు. ఆర్య సమాజ్‌ సిద్ధాంతాలతో 1970లో ఆర్యసభ పార్టీ స్థాపించారు. 1977లో ‌హర్యానాలో ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచారు.

శ్రమదోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు అగ్నివేశ్. 2011లో దేశవ్యాప్తంగా సాగిన అవినీతి వ్యతిరేక పోరాటంలో అగ్నివేశ్‌ భాగస్వాములయ్యారు. 2011లోనే ఛత్తీస్‌గఢ్‌లో ఐదుగురు పోలీసుల కిడ్నాప్‌ సందర్భంగా నక్సల్స్‌తో చర్చలు జరిపిన బృందంలో ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story