Pinarayi Vijayan: మే 20న పినరయి విజయన్‌ ప్రమాణస్వీకారం.. !

Pinarayi Vijayan: మే 20న పినరయి విజయన్‌ ప్రమాణస్వీకారం.. !
X
Pinarayi Vijayan : తాజాగా వెలువడిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి విజయాన్ని అందుకొని సీఎం పినరయి విజయన్‌ నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

Pinarayi Vijayan : తాజాగా వెలువడిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి విజయాన్ని అందుకొని సీఎం పినరయి విజయన్‌ నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎల్డీఎఫ్‌ ప్రభుత్వ కేబినెట్‌ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయబోతోంది. మొత్తం 21 మందితో కూడిన కేబినెట్‌ ఉంటుందని సీపీఎం యాక్టింగ్‌ రాష్ట్ర కార్యదర్శి విజయ రాఘవన్‌ చెప్పారు. కరోనా నేపధ్యంలో ఎలాంటి ఆర్భాటాలు లేకుండానే ప్రమాణస్వీకర కార్యక్రమం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఎల్డీఎఫ్‌ కేబినెట్‌లో సీపీఎం నుంచి 12 మంది, సీపీఐ నుంచి నలుగురు, కేరళ కాంగ్రెస్‌ (ఎం), జనతాదళ్‌ (ఎస్‌), ఎన్సీపీ తరఫున ఒక్కొక్కరు ఉంటారని తెలిపారు. స్పీక‌ర్ ప‌ద‌వి సీపీఐ (ఎం) చేప‌ట్ట‌నుండ‌గా.. డిప్యూటీ స్పీక‌ర్ ప‌దవిని సీపీఐ, చీఫ్ విప్ ప‌ద‌విని కేర‌ళ కాంగ్రెస్ (ఎం) చేప‌ట్ట‌నున్నాయన్నారు.

Tags

Next Story