మారుతి స్విప్ట్.. సరికొత్తగా మార్కెట్లోకి.. ఫీచర్లు, ధర..

మధ్యతరగతి వాసికి అందుబాటు ధరలో మారుతి స్విప్ట్ వచ్చేస్తుంది. దేశంలో సేల్స్ పరంగా సక్సెస్ సాధించిన కార్లలో మారుతి స్విప్ట్ ఒకటి. తాజాగా ఈ కారు మరింత అప్‌డేట్ వెర్షన్‌తో మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. పాత మోడల్ లో కే12 బీ పెట్రోల్ ఇంజన్, 1.3 లీటర్ డీడీఐఎస్ డీజిల్ ఇంజిన్ల స్థానంలో ఈ సరికొత్త 1.2 లీటర్ K12N DualJet petrol engine తో ఈ వాహనం మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఈ కారు ప్రారంభ ధర రూ.5.21 లక్షలుగా (ఎక్స్ షోరూం ధర) కంపెనీ నిర్ధేశించింది.
ఇది 90 పీఎస్ పవర్, 113 ఎన్ఎం టార్క్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కే12బీ పెట్రోల్ ఇంజన్‌తో పోలిస్తే దీని 7 పీఎస్ పవర్ ఎక్కువగా ఉండే వీలుంది. డిజైర్ వాహనంలో ఉన్న 12 వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టం ఇంజన్ ఆప్షన్ ఇందులో లేదు. అయితే ఫ్యూయల్ ఎఫిషియన్సీ, start/stop function కలిగి ఉండటం విశేషం. ఈ సరికొత్త స్విప్ట్ వాహనం మైలేజి కూడా లీటరుకు గరిష్టంగా 24.12 కిలోమీటర్లు ఇస్తుంది. అదే ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పని చేసే వేరియంట్ అయితే లీటరుకు గరిష్టంగా 23.36 కిలోమీటరల్ మైలేజి ఇస్తుంది.
స్విప్ట్ పెట్రోల్ వేరియంట్ అయితే లీటరుకు గరిష్టంగా 21.21 కిలోమీటర్ల వరకు మైలేజి ఇస్తుందని తెలిపారు. ధర విషయానికి వస్తే దేశ రాజధానిలో Marut swift LXI బేస్ మోడల్ ఎక్స్ షోరూం ధర రూ.5.20 లక్షలుగా ఉంది. ఆన్ రోడ్ రూ.5,73,036కు లభించనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com