Swiggy: ఊడుతున్న ఉద్యోగాలు.. స్విగ్గీలో 380 మందికి ఉద్వాసన

Swiggy: ఊడుతున్న ఉద్యోగాలు.. స్విగ్గీలో 380 మందికి ఉద్వాసన
Swiggy: ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ వేదిక స్విగ్గీ శుక్రవారం నాడు 380 మంది ఉద్యోగులను తొలగించింది.

Swiggy: ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ వేదిక స్విగ్గీ శుక్రవారం నాడు 380 మంది ఉద్యోగులను తొలగించింది. అత్యంత క్లిష్ట పరిస్థితి"ని ఎదుర్కోవటానికి చాలా పెద్ద కంపెనీలు పెద్దఎత్తున లేఆఫ్‌లను ఎంచుకున్నాయి. ఇందులో భాగంగానే రోజుకో కంపెనీ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. చాలా మందికి 2023 సంవత్సరం ప్రారంభంలోనే సరిగా లేదు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా 380 మంది ఉద్యోగులను తొలగించిన స్విగ్గీ ఇది "అత్యంత కష్టమైన నిర్ణయం" అని పేర్కొంది.



ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, గోల్డ్‌మన్ సాచ్స్, అమెజాన్ వంటి అనేక పెద్ద కంపెనీలు మార్కెట్ పరిస్థితుల కారణంగా భారీ తొలగింపులను చేపట్టాయి. కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి కంపెనీ కట్టుబడి ఉందని, అందుకోసమే ఈ "కఠిన నిర్ణయాన్ని" తీసుకున్నామని స్విగ్గీ CEO చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story