Synthetic Milk: అలెర్ట్.. మార్కెట్లో సింథటిక్ పాలు.. వాషింగ్ పౌడర్, రిఫైన్డ్ ఆయిల్ మిక్స్ చేసి..

Synthetic Milk: అలెర్ట్.. మార్కెట్లో సింథటిక్ పాలు.. వాషింగ్ పౌడర్, రిఫైన్డ్ ఆయిల్ మిక్స్ చేసి..
Synthetic Milk: ఆవులు, గేదెల నుంచి వచ్చేవి మాత్రమే పాలు అని అనుకోవడానికి లేదు.. రసాయనాలు కలిపి కూడా పాలు తయారు చేసేస్తున్నారు మోసగాళ్లు. వాటిని మార్కెట్ చేసి ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు.

Synthetic Milk: ఆవులు, గేదెల నుంచి వచ్చేవి మాత్రమే పాలు అని అనుకోవడానికి లేదు.. రసాయనాలు కలిపి కూడా పాలు తయారు చేసేస్తున్నారు మోసగాళ్లు. వాటిని మార్కెట్ చేసి ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు.


చిన్నారులు, వృద్ధులు ఎక్కువగా పాలు తాగడానికే ఇష్టపడుతుంటారు. పాలు బలవర్ధకమైన పోషకాహారం,. అందులో సందేహం లేదు. కానీ కల్తీపాలతో అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. గేదెలు, ఆవులకు ఇంజక్షన్లు చేసి పాలు ఎక్కువగా రావాలని చేసే వాళ్లు కొందరైతే, పాలు కావాలంటే బర్రెలతో పనేముంది మా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉందని రసాయనాలు మిక్స్ చేసి చిక్కటి పాలు తయారు చేసేస్తున్నారు. వాటితో డబ్బులు సంపాదించేస్తున్నారు. వీటి ద్వారా ఎంతోమంది అనారోగ్యానికి గురవుతున్నామన్న ఆలోచన కించిత్ కూడా లేకపోవడం శోచనీయం.


ఉత్తరప్రదేశ్ పోలీసులు బదౌన్ జిల్లాలోని మూసాజాగ్ ప్రాంతంలోని ఒక గ్రామంలో సింథటిక్ పాల తయారీ యూనిట్‌ను కనుగొన్నారు పోలీసులు. వాషింగ్ పౌడర్, రిఫైన్డ్ ఆయిల్, రసాయనాలను ఉపయోగించి తయారు చేసిన 100 లీటర్ల సింథటిక్ పాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (ఎఫ్‌ఎస్‌ఓ) ఫిర్యాదు మేరకు యూనిట్ యజమానిని అరెస్టు చేశామని, ఐపిసిలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ఇంటి లోపల యూనిట్ నడుస్తోందని, దాని యజమాని పరిసర ప్రాంతాల్లోని పలు దుకాణాలకు పాలను సరఫరా చేస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు యూనిట్‌పై దాడి చేసి యజమానిని అరెస్ట్ చేశారు.


మరోవైపు ఫుడ్‌ సేఫ్టీ టీమ్‌ ఆ ప్రాంతంలోని పలు దుకాణాల నుంచి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. ఈ కేసులో ఫ్యాక్టరీ యజమాని మంగుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తదుపరి విచారణ జరుగుతోంది అని అధికారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story