టేబుల్‌ టెన్నిస్‌ ప్రముఖుడు ఎస్‌ఎమ్‌ సుల్తాన్‌తో పాటు నలుగురు కరోనాతో మృతి

టేబుల్‌ టెన్నిస్‌ ప్రముఖుడు ఎస్‌ఎమ్‌ సుల్తాన్‌తో పాటు నలుగురు కరోనాతో మృతి

ఆంధ్రప్రదేశ్‌ టేబుల్‌ టెన్నిస్‌ సంఘం సెక్రెటరీ, భారత టీటీ సమాఖ్య ఉపాధ్యక్షుడు ఎస్‌.ఎమ్‌.సుల్తాన్‌ మూసావి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇటీవలే కరోనా బారిన పడ్డ ఆయన.. విజయవాడలో శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన సతీమణి కూడా అంతకు ముందు రోజే కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. గతవారమే ఆయన తల్లి కరోనాతో మృతి చెందారు. సుల్తాన్‌ తనయుడు కరోనా బారిన పడి ఆదివారం ప్రాణాలు విడిచాడు. వారం రోజుల్లో ఒకే కుటుంబంలో నలుగురు కరోనాతో చనిపోవడంతో తీవ్ర విషాదాన్ని నింపింది.

తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశవ్యాప్తంగా టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాభివృద్ధిలో.. సుల్తాన్‌ కీలక పాత్ర పోషించారు. ఆయన అకాల మరణంతో క్రీడాలోకంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. సుల్తాన్‌ లేని లోటు పూడ్చలేనిదని.. ఆయన ప్రోత్సాహంతో ఎందరో క్రీడాకారులు ముందడుగు వేశారని.. క్రీడా ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు.

Next Story