తాలిబన్లది స్వాతంత్య్ర పోరాటమే... ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..!

ఆఫ్గనిస్తాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా అఫ్గాన్ పరిణామాలపై ఉత్తరప్రదేశ్ కి చెందిన ఎంపీ ఒకరు వివాదస్పద వాఖ్యలు చేశారు. తాలిబన్లు స్వాధీనం చేసుకోవడాన్ని భారత స్వాతంత్య్ర పోరాటంతో పోల్చారయన.. ఆయనే సంభాల్ నియోజకర్గ ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ నేత షఫీక్ ఉర్ రెహ్మాన్ బర్ఖ్.. ఒకరకంగా వారిది స్వాతంత్య్ర పోరాటమేనని అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అయ్యాయి. తమ దేశానికి స్వేచ్ఛ కావాలని తాలిబన్లు కోరుకున్నారని, అనుకున్నది సాధించారని చెప్పుకొచ్చారు. ఎంపీ షఫీక్ ఉర్ రెహ్మాన్ బర్ఖ్ చేసిన వ్యాఖ్యల పైన ఆ రాష్ట్ర సీఎం ఆదిత్యనాథ్ స్పందించారు. ప్రతిపక్ష ఎంపీ సిగ్గులేకుండా తాలిబన్లను సమర్థిస్తున్నారని విమర్శించారు.వారిని సమర్దించడం అంటే రాక్షసకాండను సైతం సమర్థించినట్లేనని అన్నారు. గతంలో కూడా బర్ఖ్ పలు అంశాల పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా బర్ఖ్ ఐదుసార్లు ఎంపీగా మరియు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com