అమ్మానాన్నలతో పాటు నాక్కూడా..: తమన్నా

అమ్మానాన్నలతో పాటు నాక్కూడా..: తమన్నా
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

అగస్ట్‌లో నటి తమన్న అమ్మానాన్న కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. అప్పుడు ఆమెకు టెస్ట్ చేసినా నెగిటివ్ వచ్చింది. అయితే గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొన్న ఆమెకు పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. పాజిటివ్ అని తెలిసిన వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా తమన్న బాలీవుడ్‌లో నవాజుద్దీన్ సిద్దిఖీ, కబీర్ దుహాన్ సింగ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న బాలీవుడ్ చిత్రం బోలే చుడియన్‌లో నటిస్తోంది. ఈ చిత్రానికి నవాజుద్దీన్ సోదరుడు షమాస్ నవాబ్ సిద్ధిఖీ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో సీటిమార్, దటీజ్ మహాలక్ష్మి చిత్రాల్లో నటిస్తోంది.

Tags

Next Story