సినీ నటి రాధ కేసులో కీలక మలుపు

వర్ధమాన నటి రాధ కేసు కీలక మలుపు తిరిగింది. తన భర్త మోసం చేశాడని, వేధింపులకు గురి చేస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె.. కేవలం 24 గంటల్లో ఆ కేసును వెనక్కి తీసుకున్నారు. పలు తమిళ చిత్రాల్లో నటించిన రాధ తన మొదటి భర్తకు విడాకులిచ్చి.. చెన్నై సాలిగ్రామంలో తన తల్లి, కుమారుడితో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో షూటింగ్ సమయంలో అక్కడ స్థానికంగా ఎస్‌ఐగా పనిచేస్తున్న వసంతరాజ్ తో పరిచయం ఏర్పడి.. అది పెళ్ళికి దారి తీసింది. ఈ క్రమంలో వసంతరాజ్ ను రెండో వివాహమాడి అదే ఇంటిలో కొనసాగుతున్నారు రాధ. ఆయితే ఇటీవల తనను అనుమానిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడని, భౌతికదాడులకు పాల్పడుతున్న భర్త వసంతరాజ్ పైన గురువారం విరుగంబాక్కం పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆ కేసును వెనక్కి తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com