రైతులకి భారీ ఊరట.. రూ .12,110 కోట్ల వ్యవసాయ రుణం రద్దు!

రైతులకి భారీ ఊరట.. రూ .12,110 కోట్ల వ్యవసాయ రుణం రద్దు!
రైతులకి శుభవార్తను వెల్లడించింది తమిళనాడు ప్రభుత్వం. రూ .12,110 కోట్ల వ్యవసాయ రుణాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది.

రైతులకి శుభవార్తను వెల్లడించింది తమిళనాడు ప్రభుత్వం. రూ .12,110 కోట్ల వ్యవసాయ రుణాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి రాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం దీనికి సంబంధించిన ప్రకటన చేశారు. సీఎం ప్రకటన ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16.43 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. త్వరలోనే తమిళనాడుకి అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో సీఎం ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా అకాలవర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న పంటలకు రూ.1,117 కోట్ల పరిహారాన్ని సీఎం ఇంతకుముందే ప్రకటించారు. దీంతో సుమారు 11 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు.


Tags

Next Story