MK Stalin: 'గో బ్యాక్ స్టాలిన్'.. స్టాలిన్ ప్రభుత్వాన్ని వెలివేస్తున్న ప్రజలు..

MK Stalin (tv5news.in)

MK Stalin (tv5news.in)

MK Stalin: తమిళనాడు సీఎం ఎమ్ కే స్టాలిన్ అంటే చాలామందికి అభిమానం.

MK Stalin: తమిళనాడు సీఎం ఎమ్ కే స్టాలిన్ అంటే చాలామందికి అభిమానం. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుండి నడిపిస్తారని.. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు కరెక్ట్‌గా పనిచేసేలా చూసుకుంటారని.. ఇలా చాలా విషయాల్లో స్టాలిన్‌ను ప్రజలు ఇష్టపడతారు. కానీ అలాంటి ఓ ముఖ్యమంత్రిపై ఇప్పుడు నెగిటివిటీ ఏర్పడుతోంది. 'గో బ్యాక్ స్టాలిన్' అనే హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మరి అంతలా అసలు తమిళనాడులో ఏం జరిగింది.

తమిళనాడును ప్రతీ సంవత్సరం ముంచెత్తే ఒక ప్రమాదం.. వరదలు. అలాగే ఈసారి తమిళనాడులో వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుదిరినంత వరకు సహాయ చర్యలను దగ్గరుండి చూసుకున్నారు. ప్రజలకు వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. కానీ చాలామంది ప్రజలు వరదల సమయంలో స్టాలిన్ తమరిని పట్టించుకోలేదంటూ విమర్శిస్తు్న్నారు. ఆ వరదల సమయంలో స్టాలిన్ ప్రభుత్వం ప్రజలను ఆదుకునే విషయంలో విఫలమయిందని చెప్తున్నారు.

తమిళనాడు రాష్ట్రం ఇంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా కొన్ని అత్యవసర వస్తువుల ధరలు స్టాలిన్ ప్రభుత్వం పెంచేసిందంటూ ప్రజలు వాపోతున్నారు. బస్తా సిమెంట్ ధర రూ. 360 ఉండగా అది ఏకంగా రూ. 520కి పెరిగింది. అంతే కాకుండా పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా వ్యాట్ తగ్గించుకుండా ముందున్న ధరలనే కొనసాగిస్తు్న్నారని అంటున్నారు. అందుకే ఒక్కసారిగా స్టాలిన్‌ను వెలివేస్తున్నారు తమిళనాడు ప్రజలు. అది అందరికీ అర్థం కావడం కోసం ట్విటర్‌లో ట్రెండ్ కూడా చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story