జాతీయం

Tamil Nadu: పాఠశాల వినూత్న కార్యక్రమం.. తెలుగు మీడియంలో చేరితే ఉచితంగా..

Tamil Nadu: ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా చేసుకుంది యాజమాన్యం.

Tamil Nadu: పాఠశాల వినూత్న కార్యక్రమం.. తెలుగు మీడియంలో చేరితే ఉచితంగా..
X

Tamil Nadu: ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా చేసుకుంది యాజమాన్యం. తమిళనాడు అత్తిమంజేరి తెలుగు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న చర్యలు చేపడుతున్నారు.

పల్లిపట్టు మండలం అత్తిమంజేరి ప్రభుత్వ ప్రాథమిక తెలుగు పాఠశాలలో 15 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రధానోపాధ్యాయులుగా భూపతి, సహా ఉపాధ్యాయులుగా మునెమ్మ, మాధవన్‌లు ఉన్నారు. నిర్బంధ తమిళ విద్యావిధానం తెలుగు పాఠశాలలకు శాపంగా మారింది.

అయితే ఇటీవలి కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపడి నాణ్యమైన బోధన అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 13న పాఠశాలలు పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో అడ్మిషన్లు పెంచాలని నిర్ణయించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం విద్యార్థుల కుటుంబాలకు రూ.1000 విలువ చేసే టేబుల్ ఫ్యాన్ ను పాఠశాల యాజమాన్యం అందిస్తోంది. దీంతో తొలిరోజే నలుగురు విద్యార్థులు పాఠశాలలో చేరారు. వీరికి సర్పంచ్ ఝాన్సీ ప్రకాష్ బహుమతిని అందజేశారు.

గతంలో తెలుగు మీడియంలో విద్యార్థులను చేర్పించాలనే ఉద్దేశంతో అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికి ప్రిన్సిపల్ భూపతి ఉచితంగా గ్రాము బంగారం అందించారు.

Next Story

RELATED STORIES