Tamilanadu: చెన్నై గోడలపై గెటౌట్ గవర్నర్‌ రవి పోస్టర్లు

Tamilanadu: చెన్నై గోడలపై గెటౌట్ గవర్నర్‌ రవి పోస్టర్లు
X

తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి,ఎంకే స్టాలిన్ సర్కార్ మధ్య వివాదం చల్లారడం లేదు. మళ్లీ గెటౌట్ రవి పోస్టర్లు చెన్నై గోడలపై ప్రత్యక్షమయ్యాయి. గతంలో తమిళనాడు అసెంబ్లీలో ప్రసంగపాఠం చదివే సమయంలో తమిళనాడు అనే పదంతో పాటు, ద్రవిడ నేతల పేర్లున్న పేరాలను గవర్నర్ చదవకుండా దాటవేయడం, ఇందుకు ప్రతిగా గవర్నర్ రవి ప్రసంగాన్ని రికార్డుల్లో చేర్చవద్దని తమిళనాడు అసెంబ్లీ తీర్మానించడం, గవర్నర్ వాకౌట్ చేయడం వంటి పరిణామాలతో అప్పట్లో భారీగా గెటౌట్ రవి పోస్టర్లు వెలిశాయి. మళ్లీ లేటెస్ట్ గా గవర్నర్‌ తీరుకు నిరసనగా తమిళనాడుతో డీఎంకే పార్టీ పోస్టర్లను వేసింది.

Tags

Next Story