జేమ్స్‌బాండ్ 007 నటి మృతి

జేమ్స్ బాండ్ నటి తాన్య రాబర్ట్ 65 సంవత్సరాల వయసులో మరణించారు. క్రిస్మస్ పండుగ రోజు తన పెంపుడు కుక్కను తీసుకుని వాకింగ్‌కి వెళ్లిన ఆమె కొద్ది దూరం వెళ్లగానే కుప్పకూలారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి కండిషన్ సీరియస్‌గా ఉందని వెంటిలేటర్‌పై ఉంచారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం ఆమె కన్నుమూశారు. మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన రాబర్ట్ ఆతరువాత సినిమాల్లో అవకాశాలు రావడంతో నటనపై దృష్టి సారించారు. 1980 లో చార్లీ ఏంజిల్స్.. ఐదు, చివరి సీజన్‌లలో నటించారు.
1985 లో, రాబర్ట్స్ 'బాండ్ గర్ల్' హోదాకు ఎదిగారు, ఎ వ్యూ టు కిల్ లో రోజర్ మూర్ సరసన స్టాసే సుట్టన్ పాత్ర పోషించారు
హిట్ సిట్కామ్, దట్ 70 షోలో మిడ్జ్ పిన్సియోటి పాత్రలో రాబర్ట్స్ ప్రశంసలు అందుకున్నారు. ఆమె 1998- 2004 నుండి కామెడీ హీరోలు అష్టన్ కుచర్, మిలా కునిస్‌లతో కలిసి నటించారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తను చూసుకోవటానికి ఆమె నటనకు దూరంగా ఉన్నారు. హాలీవుడ్ స్టార్ - 1985 బాండ్ చిత్రం ఎ వ్యూ టు కిల్ లో రోజర్ మూర్ సరసన నటించి ప్రశంసలందుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com