టీసీఎస్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ నుంచి..

టీసీఎస్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ నుంచి..
భారతదేశపు అతిపెద్ద ఐటి సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) తన ఉద్యోగులందరికీ 2021-22 ఆర్థిక సంవత్సరానికి వేతనాల పెంపును ప్రకటించింది.

భారతదేశపు అతిపెద్ద ఐటి సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) తన ఉద్యోగులందరికీ 2021-22 ఆర్థిక సంవత్సరానికి వేతనాల పెంపును ప్రకటించింది. ఈ పెంపు ఏప్రిల్ 2021 నుండి అమల్లోకి వస్తుందని ఐటి కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఏప్రిల్ 2021 నుండి సంస్థలోని అన్ని ప్రాంతాల అసోసియేట్‌లకు ఇంక్రిమెంట్ ఇవ్వడం జరుగుతుందని టిసిఎస్ ఒక ప్రకటన విడుదల చేసింది.

నివేదికల ప్రకారం టిసిఎస్ ఆరు నెలల వ్యవధిలో ఇది రెండవసారి ఉద్యోగుల జీతం పెంచడం. అయితే, కరోనావైరస్ మహమ్మారి కారణంగా టిసిఎస్ ఉద్యోగులకు గత సంవత్సరం ఇంక్రిమెంట్ ఆలస్యం అయింది.

ఇప్పుడు కంపెనీ ఉద్యోగులకు నిబంధనల ప్రకారం దాదాపు 12-14 శాతం సగటు జీతం పెంపు లభిస్తుంది. రెగ్యులర్ ప్రమోషన్ సైకిల్ ప్రకారం, టిసిఎస్ తన ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వడం కొనసాగిస్తుందని తెలిపింది. ముంబై సంస్థలో 4 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారు, వారు సంస్థ వేతనాల పెంపు నిర్ణయం నుండి లబ్ది పొందుతారు.

Tags

Read MoreRead Less
Next Story