Tata Group : దూకుడుమీదున్న ఎయిర్ ఇండియా, 470 విమానాలకు ఆర్డర్
ప్రపంచంలోనే అతిపెద్ద విమానయాన ఒప్పందం జరిగింది. టాటా గ్రూప్ - ఎయిర్ ఇండియా 250 ఎయిర్ బస్, 220 బోయిన్ విమానాలను కొనేందుకు ఆర్డర్ చేసింది. ఫ్రాన్స్, అమెరికా విమానాల తయారీ సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. ఈ లావాదేవీలు $85 బిలియన్ల కంటే ఎక్కువ విలువైనది. అమెరికా కంపెనీలకు ఆర్డర్ ఇవ్వడంతో యూఎస్ఏ ప్రెసిడెంట్ జో బైడెన్ సంతోషించారు. 44రాష్ట్రాలలోని ఒక మిలియన్ ఉద్యోగాలను ఇచ్చేందుకు ఈ ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
"ఎయిర్ ఇండియా, బోయింగ్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం జరిగింది. దీని ద్వారా 200పైగా అమెరికన్ నిర్మిత విమానాలను భారత్ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ప్రకటిస్తున్నందుకు నేను గర్విస్తున్నాను. ఈ ఒప్పందం ద్వారా 44 రాష్ట్రాల యువతకు ఉద్యోగావకాశాలు సృష్టింపబడనున్నాయి. " అని జెబైడెన్ వైట్ హౌజ్ ద్వారా ప్రకటక విడుదల చేసారు.
ఎయిర్ ఇండియా, బోయింగ్ మధ్య కుదిరిన ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోదీ, జో బైడెన్ మట్లాడారు. పరస్పర ప్రయోజనకరమైన సహకారానికి ఉదాహరణగా ఈ ఒప్పందం నిలుస్తుందన్నారు. ప్రధాని మోదీతో కలిసి అమెరికా పౌరులకు మరింత సురక్షితమైన, సంపన్నమైన భవిష్యత్తును సృష్టించడంతో పాటు... భాగస్వామ్య ప్రపంచ సవాళ్లను ఎదుర్కొంటూనే అమెరికా - భారత్ కలిసి మరింత అభివృద్ధిని సాధించాలని కోరుతున్నట్లు బైడెన్ తెలిపారు. అమెరికాలో లేఆఫ్ లు ఎక్కువ కావడంతో అక్కడ ఉద్యోగావకాశాలు సన్నగిల్లాయి. అలాంటి పరిస్థితితులలో ఎయిర్ ఇండియా ఒప్పందం యూఎస్ఏలో ఉద్యోగాలను కల్పిస్తుండటంతో అమెరికా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ, రతన్ టాటా, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వర్చువల్ మీటింగ్ ద్వారా మాట్లాడారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాట్లాడుతూ... భారతదేశం మా పరిశ్రమలపై ఉంచిన విశ్వాసానికి ప్రధాని మోదీకి ధన్యవాదాలు, భారత్, ఫ్రాన్స్ యొక్క వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త దశను ఈ ఒప్పందం సూచిస్తుందని అన్నారు.
టాటా గ్రూప్ - ఎయిర్ ఇండియా కొత్త విమానాలకు ఆర్డర్ ఇవ్వడంతో భారత ఎవియేషన్ రూపురేఖలు మారనున్నట్లు తెలుస్తోంది. లగ్జరీతో కూడిన సదుపాయాలు విమాన ప్రయాణికులను ఆకట్టుకోనున్నాయని సమాాచారం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com