మార్కెట్లోకి వచ్చిన మరో కారు.. ఆరు వేరియంట్లలో 'టాటా సఫారీ'..

టాటా మోటార్స్ కంపెనీ సఫారీ ఎస్‌యూ పేరిట ఫ్లాగ్‌షిప్ కారును మంగళవారం ఆవిష్కరించింది. మొత్తం ఆరు వేరియంట్లలో లభ్యమయ్యే ఈ మోడల్ బుకింగ్స్ ఫిబ్రవరి 4న ప్రారంభమవుతాయి. ల్యాండ్ రోవర్ డీ8 ఆర్కిటెక్చర్‌పై భారతీయ పరిస్థితలకు అనుగుణంగా టాటా సఫారీని రూపొందించారు. ఎక్స్‌జెడ్ ప్లస్, ఎక్స్‌జెడ్‌ఏ ప్లస్ వేరియంట్లు ఆరు సీట్ల సామర్థ్యాన్ని, మిగిలిన వేరియంట్లు ఏడు సీట్ల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
ఇందులో 168 హార్స్‌పవర్ సామర్థ్యం, 350 ఎన్ఎం టార్క్‌ను ఉత్ప్తత్తి చేసే రెండు లీటర్ల డీజిల్ ఇంజన్‌ను అమర్చారు. ఆరు స్పీడ్ మ్యానువల్, ఆటో ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. అలాగే పనోరమిక్ సన్‌రూప్, రెండో వరుసలో రిక్లెనింగ్ సీట్ల సదుపాయం, ఎంబెంట్ మూడ్ లైటింగ్ వ్యవస్థ, ఏసీ సదుపాయంతో పాటు మల్టీ డ్రైవ్ (సీటీ/స్పోర్ట్స్/ఎకో) మోడ్స్ లాంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ధరను త్వరలో ప్రకటిస్తామని ఆవిష్కరణ సందర్భంగా కంపెనీ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com