ఎస్బీఐ బంపరాఫర్.. టాటా సఫారీ కొనాలనుకుంటే..

కారు కొనుక్కోవాలని కోరికైతే ఉంది కానీ తీరే మార్గం కనిపించట్లేదని బాధపడుతున్నారా.. అస్సలు బాధపడాల్సిన పన్లేదు ఎస్‌బీఐ మీకు అండగా నిలుస్తోంది ఇప్పుడు. దేశీ అతి పెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ కారు కొనుగోలుదారులకు శుభవార్త అందించింది. కారు కొనుక్కోవాలని ఆశ పడుతున్న వారికి కాస్త ఊరట లభించనుంది.
టాటా సఫారీ కారు కొనాలని భావించే వారికి స్టేట్ బ్యాంక్ పలు రకాల ఆఫర్లు అందిస్తోంది. ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా కారు లోన్ తీసుకుంటే.. వడ్డీ రేటులో 0.25 శాతం తగ్గింపు ధరలో లభిస్తుంది. అలాగే ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. అంతేకాదు కారు ధరకు సమానమైన మొత్తాన్ని లోన్ రూపంలో పొందొచ్చు. మీరు మీ జేబు నుంచి పైసా కూడా తీయనవసరం లేదు. ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేసింది. యోనో యాప్ లో షాప్ అండ్ ఆర్డర్ ఆప్షన్ లోకి వెళ్లి కారు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com