TCS : లే ఆఫ్స్ లేవు.. అన్నీ హైక్ లే...

TCS : లే ఆఫ్స్ లేవు.. అన్నీ హైక్ లే...
మన టాటా తోపు... లేఆఫ్స్ లేవు... జీతాలు మాత్రం జాస్తి....

TCSలో ఉద్యోగాలను తొలగించడం లేదని ఆ సంస్థ దృవీకరించింది. టీసీఎస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ.. టీసీఎస్ లో ఆరు లక్షల మంది ఎంప్లాయిస్ పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను తీసివేస్తున్నా, టీసీఎస్ మాత్రం తమ ఉద్యోగులను తీసివేయడం లేదని చెప్పారు. జీతాల పెంపు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు.

గుగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్, అమెజాన్ వంటి పలు అంతర్జాతీయ సంస్థలు లేఆఫ్ కింద ఉద్యోగులను తీసివేస్తున్న విషయం తెలిసిందే. భారత ఐటీ దిగ్గజ సంస్థ టాటా మాత్రం తమ ఉద్యోగులను తీసివేయడంలేదని చెప్పడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.

TCS తొలగింపులు చేస్తుందేమోనన్న ఊహాగానాలపై ఆ సంస్థ, చీఫ్ HR లక్కాడ్ మాట్లాడుతూ.. టీసీఎస్ లో ఉద్యోగాల కోత ఉండదని, జీతాలు కూడా పెంచుతున్నట్లు చెప్పారు. అదనంగా, కొత్త ఉద్యోగులను తీసుకోనున్నట్లు తెలిపారు. వేరే కంపెనీల లేఆఫ్ గురించి మాట్లాడిన ఆయన.. లిమిట్ కు మించి ఉద్యోగులను తీసుకోవడంతోనే ఇప్పుడు లేఆఫ్ లు ప్రకటిస్తున్నారని అన్నారు. టీసీఎస్ కు ఆ అవసరం లేదని.. ఎప్పుడు కూడా అవసరానికి మించి ఉద్యోగులను తీసుకోలేదని స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా మాత్రం ఇతర ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఆర్థిక మాద్యం వలన ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి.

Tags

Next Story