ITS EMOTIONAL: 'ప్లీజ్ మేడమ్' వెళ్లొద్దు.. వైరల్‌గా మారిన వీడియో

ITS EMOTIONAL: ప్లీజ్ మేడమ్ వెళ్లొద్దు.. వైరల్‌గా మారిన వీడియో
ITS EMOTIONAL:

ITS EMOTIONAL: అమ్మానాన్న జన్మనిస్తే గురువులు జీవితాన్నిస్తారు.. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారి సక్సెస్ వెనుక గురువుల పాత్ర ఎంతో ఉంటుంది. చదువుతోపాటు, సంస్కారాన్ని నేర్పిన ఉపాధ్యాయులకు విద్యార్థులు ఎంతో రుణపడి ఉంటారు.

స్కూల్లో పాఠాలు నేర్పే కొందరు ఉపాధ్యాయులతో విద్యార్థులకు విడదీయరాని అనుబంధం ఏర్పడుతుంది.. అలాంటి టీచర్‌కి ట్రాన్స్‌ఫర్ అయి వేరే ఊరు వెళ్లిపోతుంటే ఆ విద్యార్థులు కన్నీటి పర్యంతం అవుతారు.. ఇలాంటి సంఘటనలు కొన్ని పాఠశాలల్లో వెలుగు చూస్తుంటాయి.

పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాలోని ఒక పాఠశాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు భావోద్వేగానికి గురవుతారు. వారి విద్యార్థి జీవితాన్ని గుర్తుకు తెస్తుంది. తమకు ఇష్టమైన ఉపాధ్యాయులను గుర్తుకు తెచ్చుకునే సన్నవేశం కళ్లముందు కనబడుతుంది. పశ్చిమ బెంగాల్‌లోని కటియాహట్ BKAP బాలికల ఉన్నత పాఠశాలలోని ఈ దృశ్యం నెటిజన్ల హృదయాలను దోచుకుంది.

తమ టీచర్‌ సంపా మామ్‌ ట్రాన్స్‌ఫర్ వెళ్లిపోతున్నారని తెలిసి టీచర్‌తో అనుబంధం ఉన్న విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు.. ఆమెకు వినూత్నంగా వీడ్కోలు చెప్పాలనుకున్నారు.. కొంతమంది విద్యార్థులు కలిసి ఆమెను గ్రౌండ్‌లోకి తీసుకు వచ్చి ఆమె ఎదురుగా గులాబీ పువ్వు పట్టుకుని హిందీ పాట 'తుజ్ మే రబ్ దిఖ్తా హై' పాడుతూ ఆమెకు పూలను బహూకరించేందుకు విద్యార్థులందరూ మోకాళ్లపై నిల్చున్నారు.

ఆ సమయంలో ఉపాధ్యాయురాలితో పాటు విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. వారి వాత్సల్యానికి పరవశించి పోయిన ఉపాధ్యాయురాలు విద్యార్థులను కౌగిలించుకుని తన ప్రేమను వ్యక్తం చేశారు. ఇట్స్ ఎమోషనల్.. విద్యార్థులు సంపా మామ్‌పై తమ ప్రేమను కురిపిస్తున్నారు. బహుశా ప్రపంచంలోని అత్యుత్తమ ఉపాధ్యాయులలో ఆమె ఒకరై ఉంటారు అని సోషల్ మీడియాలో ఈ వీడియోని పోస్ట్ చేశారు.

ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికే 24.6 K కంటే ఎక్కువమంది వీక్షించారు. నెటిజన్లు ఈ వీడియోను చూస్తే తమ అభిమాన ఉపాధ్యాయులను గుర్తు చేసుకుంటున్నారు. ఆ స్కూల్‌ని, ఆ విద్యార్థులను వదిలి వెళ్లాలని లేకపోయినా వెళ్లక తప్పని పరిస్థితి.. విద్యార్థులు కూడా మేడమ్‌ని వదల్లేక పోతున్నారు. ప్లీజ్ మేడమ్ వెళ్లొద్దు అంటున్నారే కానీ ఆమె ట్రాన్స్‌ఫర్‌ని ఆపలేకపోయారు.



Tags

Read MoreRead Less
Next Story