Rajasthan : పెళ్లి రోజు కూడా లీవ్ పెట్టలే.. నెటిజన్లు ఫిదా..!

Rajasthan : పెళ్లి రోజు కూడా లీవ్ పెట్టలే.. నెటిజన్లు ఫిదా..!
Rajasthan : సాధారణంగా ఎవరైనా తమ పెళ్లి అంటే ఓ పదిపదిహేను రోజులు సెలవులు పెడతారు.. కానీ రాజస్థాన్‌కి చెందిన ఓ ఉపాధ్యాయుడు మాత్రం

Rajasthan : సాధారణంగా ఎవరైనా తమ పెళ్లి అంటే ఓ పదిపదిహేను రోజులు సెలవులు పెడతారు.. కానీ రాజస్థాన్‌కి చెందిన ఓ ఉపాధ్యాయుడు మాత్రం తన పెళ్లి రోజున కూడా సెలవు తీసుకోవడానికి నిరాకరించాడు. ప్రముఖ కరెంట్ అఫైర్స్ ఉపాధ్యాయుడు, ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న ప్రియే కుమార్‌ గౌరవ్‌ తన వివాహం రోజున కూడా సెలవు తీసుకునేందుకు నిరాకరించి విద్యార్థులకు పాఠాలు బోధించి వృత్తి పట్ల నిబద్ధత చాటుకున్నారు.

'శిక్షా రథ్'లో ఆయన ట్యూటర్‌గా పనిచేస్తోన్న ప్రియే కుమార్‌ గౌరవ్‌ కి మే 02న వివాహం జరిగింది. లేడీస్‌ సంగీత్‌ కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా గౌరవ్‌ విద్యార్ధులకి క్లాస్ తీసుకున్నాడు. దీనిపైన శిక్షా రథ్ అధికారి నిర్మల్‌ మాట్లాడుతూ.. గౌరవ్ తన పెళ్లి గురించి అయిదు నెలల ముందే చెప్పాడని. ఇందుకోసం నాలుగు నుంచి అయిదు రోజులు సెలవులు తీసుకోవచ్చునని చెప్పామని తెలిపారు. కానీ ఒక్క క్లాస్‌ను కూడా మిస్‌ చేయకూడదని భావించిన ఆయన వివాహం రోజున కూడా పాఠాలు బోధించారని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story