ఉపాధ్యాయ దినోత్సవం.. డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ రాసిన 10 కోట్స్

ఉపాధ్యాయ దినోత్సవం.. డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ రాసిన 10 కోట్స్
రాధాకృష్ణ భారతీయ తత్వవేత్తగా, గురువుగా అనేక బోధనలను ఇచ్చారు. ఆయన విద్యార్థులకు చూపిన దారి మార్గనిర్దేశం చేస్తుంది.

హోలీ, దీపావళి మాదిరిగానే ఉపాధ్యాయ దినోత్సవాన్ని మన దేశంలో పెద్ద పండుగగా జరుపుకుంటారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న జన్మించినందున ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ఈ రోజు టీచర్స్ డే జరుపుకుంటారు. రాధాకృష్ణ గొప్ప భారతీయ తత్వవేత్తగా, గురువుగా మనకు అనేక బోధనలను ఇచ్చారు. ఆయన విద్యార్థులకు చూపిన దారి మార్గనిర్దేశం చేస్తుంది. 1962 నుండి, అతని పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ ఒకసారి "నా పుట్టినరోజును జరుపుకునే బదులు, సెప్టెంబర్ 5 ను ఉపాధ్యాయ దినోత్సవంగా పాటిస్తే అది నాకు గర్వకారణం" అని తెలుపగా ఆ రోజు నుంచి ఈ వేడుకను నిర్వహిస్తున్నారు దేశ ప్రజలు. దేశం చూపిన గొప్ప తత్వవేత్తలలో రాధాకృష్ణ ఒకరు. ఈ రోజున విద్యార్థులు దేశవ్యాప్తంగా తమ ఉపాధ్యాయులను గౌరవించి వారి ఆశీర్వాదం కోరుకుంటారు. రాధాకృష్ణ విద్యను, విద్యార్థులను ఉద్దేశించి రాసిన 10 సూక్తులను ఒకసారి నెమరువేసుకుందాం.

1. చదువుకు క్రమశిక్షణ తోడైతే బంగారానికి తావి అబ్బినట్లుంటుంది.

2. మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించు

3.విద్య యొక్క అంతిమ లక్ష్యం వ్యక్తిలోని సృజనాత్మకతను వెలికి తీయడం. చదువుకున్న వ్యక్తి చారిత్రక పరిస్థితులకు, ప్రకృతి ప్రతికూలతలకు వ్యతిరేకంగా పోరాడగలడు.

4.మన గురించి ఆలోచించటానికి మనకు సహాయపడే వారే నిజమైన ఉపాధ్యాయులు.

5.నిజమైన మతం ఒక విప్లవాత్మక శక్తి: ఇది అణచివేతకు, అన్యాయానికి శత్రువు.

6.చరిత్రను నిర్మించడానికి శతాబ్దాలు పడుతుంది. ఒక సంప్రదాయాన్ని రూపొందించడానికి శతాబ్దాల చరిత్ర పడుతుంది.

7.మతం వ్యక్తి యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. కేవలం నమ్మకం మీద కాదు.

8.సంస్కృతుల మధ్య వంతెనలను నిర్మించే సాధనాలు పుస్తకాలు

9.మనిషి ఒక విరుద్ధమైన జీవి.

10.గొప్ప సాధువుకు గతం ఉన్నప్పటికీ, చెత్త పాపికి భవిష్యత్తు ఉంది. ఊహించినంతగా ఎవరూ మంచివారు కాదు అలాగని చెడ్డవారూ కాదు.

Tags

Next Story