Lay offs: ఊద్యోగాలు పోతున్నాయి.. జీతాలు తగ్గుతున్నాయి

Lay offs: ఊద్యోగాలు పోతున్నాయి.. జీతాలు తగ్గుతున్నాయి
Lay offs: భారీ ప్యాకేజ్‌తో పెద్ద కంపెనీలో ఉద్యోగం.. బిందాస్ జీవితం అనుకున్నారు ఒకప్పుడు ప్రముఖ ఐటీ కంపెనీల ఉద్యోగులు..

Layoffs: భారీ ప్యాకేజ్‌తో పెద్ద కంపెనీలో ఉద్యోగం.. బిందాస్ జీవితం అనుకున్నారు ఒకప్పుడు ప్రముఖ ఐటీ కంపెనీల ఉద్యోగులు.. ఇప్పుడంతా సీన్ రివర్స్.. ఎవరి ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి.. వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీలు కొన్నైతే, టాప్ పొజిషన్‌లో ఉన్న వారి జీతాలను కట్ చేస్తున్నాయి మరి కొన్ని కంపెనీలు. టాప్ ఎగ్జిక్యూటివ్‌ల జీతాలను 25% వరకు, సీనియర్ మరియు మధ్య స్థాయి మేనేజర్లు వారి మూల వేతనంలో వరుసగా 10% మరియు 5% వేతన కోతను విధిస్తున్నాయి.

chip maker దిగ్గజం ఇంటెల్ CEOతో సహా మేనేజ్‌మెంట్ మరియు సీనియర్ సిబ్బంది జీతాలను తగ్గించింది. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పాట్ గెల్సింగర్ తన బేస్ సాలార్‌లో 25% కోత విధించినట్లు కంపెనీ తెలిపింది.

కంపెనీ ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. దీర్ఘకాలిక వ్యూహాన్ని సాధించేందుకు ఈ మార్పులు చేసినట్లు కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, ఇది సంస్థకు పెట్టుబడులు పెట్టేవారికి మద్దతునిస్తుంది అని పేర్కొంది.

గత నెల ప్రారంభంలో, ఇంటెల్ ఉద్యోగుల తొలగింపులను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులకు మూడు నెలల వేతనం అందించి తొలగించింది.

Tags

Read MoreRead Less
Next Story