C P Gurnani: టెక్ మహీంద్రా CEO రోజుకు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే షాకే..

CP Gurnani: టెక్ మహీంద్రా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ సీపీ గుర్నానీ 2022 ఆర్థిక సంవత్సరానికి జీతం రూ.63.4 కోట్లని ఎకనామిక్స్ టైమ్స్ నివేదించింది. 2012లో, అతను టెక్ మహీంద్రా CEO గా నియమితులయ్యారు. డిసెంబరు 19, 1958న మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌లో జన్మించిన CP గుర్నానీ తన ప్రారంభ జీవితాన్ని జైపూర్, రాజస్థాన్‌లోని ఇతర ప్రాంతాలలో గడిపారు. టెక్ మహీంద్రా అక్టోబర్ 24, 1986న ఆనంద్ మహీంద్రాచే స్థాపించబడింది. CP గుర్నానీ నవంబర్ 2004లో టెక్ మహీంద్రాలో చేరారు.
గుర్నానీ తన 35 సంవత్సరాల కెరీర్‌లో, హెచ్‌సిఎల్, హ్యూలెట్ ప్యాకర్డ్ లిమిటెడ్, పెరోట్ సిస్టమ్స్ (ఇండియా) లిమిటెడ్ మరియు హెచ్‌సిఎల్ కార్పొరేషన్ లిమిటెడ్‌తో కలిసి పనిచేశాడు. CP గుర్నానీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కెలా నుండి కెమికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందారు. నివేదికల ప్రకారం, CP గుర్నాని నికర విలువ సుమారు USD 5 మిలియన్లు (2022 నాటికి). టెక్ మహీంద్రా USD 6.0 బిలియన్ల కంపెనీ. సంస్థ కార్యకలాపాలు 90 దేశాలలో విస్తరించి ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com