తెలంగాణలో కరోనా తాజా పరిస్థితి..

తెలంగాణలో కరోనా తాజా పరిస్థితి..
X
రాష్ట్రంలో ప్రస్తుతం 29,058 యాక్టివ్ కేసులు ఉన్నాయి..

రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాత్రి 8 గంటల వరకు 54,443 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,214 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,93,600 కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. కరోనాతో నిన్న 8 మంది మ‌ృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మృతులు 1135కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్కరోజే 2,474 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,63,407కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 29,058 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 23,702 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. తెలంగాణలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 30,50,444కి చేరింది. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో 305 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Tags

Next Story