ఆఫ్గనిస్థాన్‌లో చిక్కుకుపోయిన తెలుగు వ్యక్తి..

తనను స్వదేశానికి తీసుకెళ్లాలంటూ భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు ఆఫ్గనిస్థాన్‌లో చిక్కుకుపోయిన తెలుగు వ్యక్తి. ఎనిమిదేళ్లుగా అఫ్గనిస్థాన్ రాజధాని కాబుల్‌లోని ACCL సంస్థలో పనిచేస్తున్నాడు మంచిర్యాలకు చెందిన రాజన్న. గత జూన్ 28న అక్కడి నుంచి స్వస్థలానికి తిరిగివచ్చిన ఆయన.. ఈనెల ఏడో తేదీనే అక్కడకు వెళ్లారు.
ఈలోగా కాబుల్ సహా దేశమంతా తాలిబాన్ల వశమైంది. అక్కడి భయానక వాతావరణం లోంచి బయటపడేందుకు దారులన్నీ మూసుకుపోయాయని ఆయన వాపోయాడు. ప్రస్తుతం తనతో పాటు కరీంనగర్ జిల్లా ఒడ్డారానికి చెందిన వెంకన్న కూడా విధుల్లోనే ఉన్నారని..
ఇవాళ ఇండియాకు వచ్చేందుకు తమ సంస్థ టికెట్లు సిద్ధం చేసినా విమానాలు అందుబాటులో లేవని రాజన్న ఫోన్‌లో మాట్లాడుతూ వాపోయాడు. తనని సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com