Puneeth RajKumar: పునీత్ పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతమైన బాలకృష్ణ

Puneeth RajKumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన పార్థివదేహాన్ని ఉంచిన కంఠీరవ స్టేడియానికి వెల్లువలా తరలివచ్చి తమ అభిమాన నటునికి కడసారి నివాళులు అర్పిస్తున్నారు. ప్రాంతాలు, భాషలకు అతీతంగా పెద్ద సంఖ్యలో ప్రముఖులు తరలివచ్చి పునీత్‌కు అంజలి ఘటిస్తున్నారు.
టాలీవుడ్ హీరో బాలకృష్ణ... పునీత్ పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. శోక సంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చారు. విఖ్యాత కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కూడా ఆయనతో పాటు ఉన్నారు...
కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ మూడో తనయుడు పునీత్ రాజ్‌కుమార్.. అప్పుగా, పవర్‌స్టార్‌గా పేరుతెచ్చుకున్నారు. బాలనటుడుగా దాదాపు 13 సినిమాల్లో నటించి రికార్డ్ సృష్టించారు. అంతేకాదు బాలనటుడిగా అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా నిలిచారు.
దీంతో పాటు హీరోగానూ అత్యధిక పారితోషికం అందుకున్న స్టార్‌గానూ నిలిచారు. ఆయన నటుడిగా, టెలివిజన్ ప్రజెంటర్‌గా, సింగర్‌గా రాణించారు. పునీత్ రాజ్‌కుమార్‌కి తెలుగు సినిమాలకి, తెలుగు ఫిల్మ్ మేకర్స్‌తో విడదీయలేని బంధం ఉంది.
హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం అప్పు తెలుగులో వచ్చిన ఇడియట్‌కి రీమేక్. దీనికి కూడా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. అంతేకాదు ఆయన సినిమాలో ఎన్టీఆర్ పాటపాడారు. పునీత్ సినిమాలో రవితేజ గెస్ట్‌గానూ నటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com