Temjen Imna Along : డాక్టర్ కాకున్నా పర్లేదు.. మంచి వ్యక్తివి అవ్వాలి

జాతీయ రాజకీయాల్లో నాగాలాండ్ మంత్రి టెమ్ జెన్ ఇమ్నాది ప్రత్యేక స్థానం. ఆయన దాగ్ధాటికి దేశ ప్రజలు ముగ్దులవుతుంటారు. సెన్సాఫ్ హ్యూమర్, చమత్కారం, హాస్యంలో ఆయనకు ఆయనే సాటి. తాజాగా ఓ బాలుడితో దిగిన ఫోటోనే టెమ్ జెన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ఫొటో చూడడానికి ఎంతో అందంగా ఉంది. దానికితోడు అమూల్యమూన శీర్షిక ఆ ఫొటోకు హైలెట్ గా నిలిచింది.
టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్ చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. పెద్దయ్యాక మంచి వ్యక్తికి అవ్వాలి. డాక్టర్ ఇంజనీర్ అవకపోయినా.. ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలని పిల్లాడికి చెబుతున్నట్లు పోస్ట్ చేశారు. ఇప్పటికే తన వాక్ చాతుర్యంతో యువతను ఆకట్టుకుంటున్న టెమ్ జెన్ ఇప్పుడు జాతీయంగా హాట్ టాపిక్ గా మారారు. తమ కళ్లు చిన్నగా ఉంటాయని పలువురు వెక్కిరిస్తారని అయితే ఇసుక పడకుండా ఉండటానికి తమ కళ్లు ఎంతో సహాయకారంగా ఉంటాయని ఓ సందర్భంగా ఆయన తెలిపారు. తమ ఆహార అలవాట్లు కొంచె వేరేగా ఉన్నా తామూ భారతీయులమేనని తమను గుర్తించాలని అన్నారు. ఆయన మాటలకు దేశ ప్రజలు ప్రేమతో స్వీకరిస్తున్నారు. దేశ యువతలో ఆయన స్థానం రోజు రోజుకు మెరుగవడం అందుకు నిదర్శనం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com