PM Modi: ప్రధాని మోదీ హత్యకు ఉగ్రవాదుల కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు

PM Modi: ప్రధాని మోదీ హత్యకు ఉగ్రవాదుల కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు
PM Modi: ప్రధాని మోదీని చంపేందుకు కుట్ర పన్నిన ఉగ్రవాదుల పన్నాగాన్ని బీహార్ పోలీసులు ఛేదించారు. ఇద్దరు అనుమానిత టెర్రరిస్టులను అరెస్టు చేశారు.

PM Modi: ప్రధాని మోదీని చంపేందుకు కుట్ర పన్నిన ఉగ్రవాదుల పన్నాగాన్ని బీహార్ పోలీసులు ఛేదించారు. ఇద్దరు అనుమానిత టెర్రరిస్టులను అరెస్టు చేశారు. ఈనెల 12న ప్రధాని మోదీ బీహార్‌లో పర్యటించారు. అదే సమయంలో పాట్నాలో అథర్ పర్వేజ్, ఎండీ జలాలుద్దీన్ అనే ఇద్దరు ఉగ్రవాదులు.. మోదీని లక్ష్యంగా చేసుకున్నారు. 2047 నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని, లేకుంటే మోదీని హతమార్చుతామని హెచ్చరించారు. దాంతో రంగంలోకి దిగిన బీహార్ పోలీసులు.. ఉగ్రవాదులున్న ఫుల్వారీ షరీఫ్ కార్యాలయంలో దాడులు చేశారు. ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 25 పీఎఫ్‌ఐ కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ప్రధాని మోదీ పర్యటనకు 15 రోజుల ముందు అనుమానిత ఉగ్రవాదులు ఫుల్వారీ షరీఫ్‌లో శిక్షణ పొందారని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. జులై 6, 7 తేదీల్లో ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునేందుకు ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా సమావేశాలు జరిపారని తెలిపారు. ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలో ఉగ్రవాద మాడ్యూల్ పనిచేస్తున్నట్లు చెప్పారు. కేరళ, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల యువకులను ఫుల్వారీ షరీఫ్‌కు తీసుకొచ్చి ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. అరెస్టయిన ఇద్దరు టెర్రరిస్టులు పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీతో సహా పలు ఇస్లామిక్ దేశాల నుంచి భారత దేశ వ్యతిరేక ప్రచారాలు చేసేందుకు డబ్బును పొందేవారని పోలీసులు వెల్లడించారు.

Tags

Next Story