Gorakhpur: క్లాస్ రూమ్‌లో నిద్రపోయిన చిన్నారి.. గమనించని సిబ్బంది తాళం వేసి..

Gorakhpur: పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంతో తరగతి గదిలో నిద్రపోయిన బాలుడిని గమనించకుండా తాళం వేసి వెళ్లిపోయారు. సుమారు 7గంటల పాటు క్లాసు రూములోనే ఉండిపోయిన చిన్నారి ఏడుపు విని తలుపులు తీశారు.
3వ తరగతి అబ్బాయి క్లాస్‌రూమ్‌లో నిద్రపోయాడు, స్కూల్ ముగిసిన తర్వాత 7 గంటల పాటు తాళం వేసి ఉండిపోయాడు. యూపీలోని గోరఖ్‌పూర్‌లో జరిగిన షాకింగ్ సంఘటనలో ఏడేళ్ల బాలుడు తన తరగతి గదిలో నిద్రపోయాడు. తరగతి ఉపాధ్యాయుడు కానీ, తోటి విద్యార్థులు కానీ గమనించుకోకుండా వెళ్లిపోయారు.
స్కూలుకు వెళ్లిన పిల్లవాడు టైమ్ అయిపోయినా ఇంకా ఇంటికి రాలేదేమిటి అని తల్లిదండ్రులు ఆందోళన చెంది స్కూలు ప్రిన్సిపల్‌కు ఫోన్ చేశారు. ఆయన కూడా కంగారు పడి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలో భాగంగా స్కూలుకు వచ్చారు. అలాగే బాలుడి తరగతి గదికి కూడా వచ్చారు. గది నుంచి బాలుడి ఏడుపు వినిపించడంతో తాళం తీసి లోపల ఉన్న చిన్నారిని బయటకు తీసుకు వచ్చారు.
ఏడు గంటల పాటు గదిలోనే ఉండిపోయిన బాలుడు ఏం చేయాలో తెలియక ఏడుస్తూ కూర్చున్నాడు. అమ్మానాన్నని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లైంది చిన్నారికి. ఏడ్చి ఏడ్చి అలసి పోయిన చిన్నారికి ఇంకా ఏమీ కానందుకు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోని చార్గవాన్ బ్లాక్ పరిధిలోని పరమేశ్వర్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇదిలా ఉండగా పాఠశాల ముగిసిన తర్వాత విద్యార్థులెవరైనా మిగిలిపోయారా అని పరిశీలించకుండానే పాఠశాల సిబ్బంది ఇంటికి వెళ్లిపోయారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యాన్ని పోలీసులు, చిన్నారి తల్లిదండ్రులు తప్పుపట్టారు. ముందు ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని పాఠశాల యాజమాన్యం హామీ ఇచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com