Gurugram: మైనర్ కేర్ టేకర్ ను వేధించిన దంపతులు.. ఉద్యోగాలు ఊడడంతో భోరుమంటున్నారు..

Gurugram: మైనర్ కేర్ టేకర్ ను వేధించిన దంపతులు.. ఉద్యోగాలు ఊడడంతో భోరుమంటున్నారు..
Gurugram: పనిమనిషిని పనిమనిషిలానే చూడాలి.. ఇంటి మనిషిలా చూస్తే నెత్తికెక్కుతుంది..

Gurugram: పనిమనిషిని పనిమనిషిలానే చూడాలి.. ఇంటి మనిషిలా చూస్తే నెత్తికెక్కుతుంది.. దంపతులిద్దరూ కూడబలుక్కుని తమ చిన్నారిని చూసుకోవడానికి తామే నియమించుకున్న మైనర్ బాలికను కనికరం లేకుండా కాల్చుకు తిన్నారు. చిత్ర హింసలకు గురి చేశారు.

వారినుంచి తప్పించుకున్న బాలిక కంప్లైంట్ తో దంపతుల ఉద్యోగాలు ఊడినయ్. దీంతో ఇద్దరూ ఎదురూ బొదరుఊ కూర్చుని ఏడుస్తున్నారు. తాము చేసిన పనికి దేవుడు తగిన శిక్ష విధించాడని నెత్తీ నోరు కొట్టుకుంటున్నారు. ముమ్మాటికి మేం చేసింది తప్పే.. క్షమించండి.. మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి అని అధికారుల కాళ్లా వేళ్లా పడుతున్నారు.

తమ మైనర్ ఇంటి పనిమనిషిని చిత్రహింసలకు గురిచేసినందుకు అరెస్టయిన గురుగ్రామ్ దంపతులను వారి ఉద్యోగాల నుండి తొలగించారు. రెండు కంపెనీలు ట్విట్టర్ ద్వారా వారిని తొలగిస్తున్నట్లు ప్రకటించాయి.

జార్ఖండ్ ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని అధికారిక ట్విట్టర్ ద్వారా బాలికకు పునరావాసం కల్పించేందుకు అవసరమైన సహాయాన్ని అందించాలని కోరింది. మహిళ పనిచేస్తున్న పిఆర్ ఏజెన్సీ అధికారిక ట్వీట్‌లో .. "కమల్‌జీత్ కౌర్‌ గురించి తెలుసుకున్నప్పుడు మేము షాక్ అయ్యాము. ఒక సంస్థగా, మేము భారతీయ న్యాయ వ్యవస్థను గౌరవిస్తాము. మానవ హక్కుల ఉల్లంఘన నేరం. కంపెనీ తక్షణమే ఆమె సేవలను రద్దు చేసింది" అని పేర్కొంది:

నిందితుడైన భర్త మనీష్ ఖట్టర్‌ను నియమించిన బీమా కంపెనీ కూడా ఇలా ట్వీట్ చేసింది: "మాక్స్ లైఫ్ అన్ని సమయాల్లో ఉన్నత స్థాయి నైతిక ప్రవర్తనను సమర్థిస్తుంది. అనైతిక చర్యలకు పాల్పడిన వ్యక్తి యొక్క ఉపాధిని రద్దు చేసాము. అని ట్వీట్ లో పేర్కొంది. జార్ఖండ్ "సీఎం హేమంత్ సోరెన్ ఈ అమానవీయమైన పిల్లల చిత్రహింసల చర్యపై తీవ్రంగా వేదన చెందారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన దంపతులు న్యూకాలనీకి చెందిన మనీష్ ఖట్టర్ (30), అతని భార్య కమల్‌జీత్ కౌర్ (29)గా గుర్తించారు. ఖట్టర్ న్యూకాలనీ నివాసి కాగా, ఆయన భార్య జార్ఖండ్‌లోని రాంచీకి చెందినవారు. ఖట్టర్‌ రెండు రోజుల పోలీసు రిమాండ్‌లో ఉండగా, కౌర్‌ ప్రస్తుతం జైలులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఎఫ్ఐఆర్ ప్రకారం, బాధితురాలు తన వాంగ్మూలంలో ఐదు నెలల క్రితం తన మామ న్యూ కాలనీ ప్రాంతంలోని ఒక ఫ్లాట్‌లో నివసిస్తున్న మనీష్ ఖట్టర్ ఇంట్లో తనను విడిచిపెట్టాడని తెలిపింది. "మొదటి రోజు నుండి దంపతులు నన్ను అవమానించారు, ప్రతిరోజూ కనికరం లేకుండా కొట్టేవా రు.

కమల్‌జీత్ కౌర్ అట్లకాడతో వాతలు పెట్టేది. రాత్రంతా నన్ను నిద్రపోనిచ్చేవారు కాదు. తిండి కూడా సరిగా పెట్టేవారు కాదు. మనీష్ ఖట్టర్ నన్ను వివస్త్రను చేసి మరీ కొట్టేవాడు. నా ప్రైవేట్ భాగాలను కూడా గాయపరిచాడు. నన్ను బలవంతంగా వారి ఇంటి వద్దే బంధించారు. నా కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి కూడా అనుమతించే వారు కాదు " అని బాధితురాలు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.

రిమాండ్‌లో ఉన్న నిందితుడు మనీష్ ఖట్టర్, ఢిల్లీకి చెందిన ప్లేస్‌మెంట్ ఏజెన్సీ నుండి తమ మూడున్నరేళ్ల కుమార్తెను ఆన్‌లైన్‌లో చూసుకోవడానికి ఐదు నెలల క్రితం బాలికను నియమించుకున్నట్లు వెల్లడించాడు. మా బృందం ఈరోజు ఢిల్లీలో ఏజెన్సీ కోసం వెతికింది. ఆమెను కొట్టేవాడినని నిందితుడు ఒప్పుకున్నాడు" అని న్యూకాలనీ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్ దినకర్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story